Saturday, September 13, 2025 04:24 AM
Saturday, September 13, 2025 04:24 AM
roots

ఫ్యూయల్ స్విచ్ లపై ఎయిర్ ఇండియా సంచలన ప్రకటన

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో భయాలు.. గత నెల రోజుల నుంచి ప్రపంచ విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఎవరికి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ప్రమాదమే అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ప్రమాదం అనడం కంటే ఏదో జరిగిందనే అనుమానమే ఎక్కువగా ఉంది. ఇటీవల బయటకు వచ్చిన ప్రాధమిక నివేదికలో ఓ విషయం భయపెట్టింది. విమానం ఇంధనం స్విచ్ లు ఆపిన విషయంలో పైలెట్ ల మధ్య జరిగిన సంభాషణ బయటపెట్టారు.

Also read : గంటకో బులిటెన్ వేసినా జనం నమ్మరు: ధూళిపాళ్ళ ఇంట్రస్టింగ్ కామెంట్స్

దీనితో ఇది కుట్ర అనే డౌట్స్ మొదలయ్యాయి. బోయింగ్ విమానాల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయనే మాట కూడా వినపడింది. ఈ తరుణంలో ఎయిర్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787-8 విమానాలన్నింటిలోనూ ఇంధన నియంత్రణ స్విచ్ యొక్క లాకింగ్ మెకానిజంను ముందు జాగ్రత్తగా తనిఖీలు చేసిందని, ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం చేసింది. జూలై 21 నాటికి నిర్దిష్ట బోయింగ్ విమాన నమూనాల స్విచ్ లను తనిఖీ చేయాలని పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

Also read : బ్రిటన్ ను భయపెడుతోన్న పురాతన వ్యాధి.. వణికిపోతున్న గవర్నమెంట్

దీనితో ఎయిర్ ఇండియా.. తమ నిపుణులతో తనిఖీ చేయించింది. అహ్మదాబాద్‌లో జరిగిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నివేదిక ప్రకారం, రెండు ఇంజిన్‌ల ఇంధన కటాఫ్ స్విచ్‌లను ఒకదాని తర్వాత ఒకటిగా, 1-సెకన్ విరామంలో, లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల తర్వాత ఎత్తులో కటాఫ్ కు మార్చారు. అదే విమాన ప్రమాదానికి కారణం అయింది. ఇక పైలెట్ ల హెల్త్ రిపోర్ట్ లపై సైతం ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. నిపుణల వాదన ప్రకారం.. స్విచ్ లను మాన్యువల్ గా మార్చడమే సాధ్యం అవుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్