Friday, September 12, 2025 07:19 PM
Friday, September 12, 2025 07:19 PM
roots

బాలయ్యకు పద్మ పురస్కారం అవసరమా..?

ఓ సినిమా యాక్టర్ కు పద్మ పురస్కారం ఎందుకు.. అసలు బాలకృష్ణకు పద్మ అవార్డు అవసరమా… ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మాట బాగా వినిపిస్తోంది. అసలు బాలయ్యకు పద్మ పురస్కారం అవసరమా అనే వాళ్ల కోసమే ఈ వార్త. ఎందుకంటే బాలకృష్ణ గురించి తెలియని వారు మాత్రమే ఈ మాట అంటారు. కళల విభాగంలో బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఏం చేశారని పద్మభూషణ్ అవార్డు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. అలాగే సినిమాలో బాలకృష్ణ చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఇలాంటి వారికి అవసరమా అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Also Read : డిస్ట్రిబ్యూటర్లను ముంచిన పుష్ప : నిర్మాత సంచలన కామెంట్స్

అయితే బాలకృష్ణ గురించి మాట్లాడాలంటే తండ్రి నందమూరి తారక రామారావు సినీ వారసునిగా సినిమా హీరోగా కెరీర్ మొదలు పెట్టిన బాలయ్య… ప్రస్తుతం తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సినీ రంగంలో టాప్ హీరోగా వెలుగుతున్న సమయంలోనే బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి పేరుతో క్యాన్సర్ పై పోరాటం మొదలు పెట్టారు. సుమారు 3 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అదే సమయంలో పేదలకు, అనాధ పిల్లలకు అవసరమైన వైద్యం ఉచితంగా ఇస్తుంది బసవ తారకం. తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. బసవ తారకం ఆసుపత్రిలో కాలు పెడితే చాలు అన్నీ మర్చిపోతా అంటారు బాలకృష్ణ. ఇక తన పుట్టినరోజు వేడుకలను క్యాన్సర్ రోగుల మధ్య జరుపుకోవడమే సంతోషంగా ఉంటుందని బాలకృష్ణ ఇప్పటికే పలుమార్లు బాహాటంగానే చెప్పారు.

అలాగే హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు బాలకృష్ణ. సినిమాల్లో, వ్యాపారాల్లో బిజీగా ఉన్నప్పటికీ… హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు. పైగా నియోజకవర్గం నుంచి ఏ నిమిషంలో అయినా సరే ఎవరు ఫోన్ చేసినా సరే వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేస్తారు బాలకృష్ణ. అలాగే ప్రతి నెలా 3 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి సమస్యలు స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరిస్తారు కూడా. ఇక క్రమశిక్షణ విషయంలో బాలకృష్ణకు ఎవరూ పోటీ పడలేరు. ఉదయం 3 గంటలకే నిద్ర లేవటం, యోగా, పూజలు చేసి ఉదయం 6 గంటలకు తన దినచర్య ప్రారంభిస్తారు.

Also Read : వైసీపీ క్యాడర్ భయం వెనుక కారణం జగన్ రెడ్డేనా..?

బాలకృష్ణకు కోపం ఎక్కువ… అభిమానులను కూడా కొడతారు అనేది కొంతమంది మాటలు. నిజమే కొడతారు.. కానీ ఆయన చేతుల్లో దెబ్బలు తిన్న వాళ్ల మాటల్లో మాత్రమే.. మా బాలయ్య చెయ్యి తగిలింది.. అది చాలు అంటారు. పౌరాణిక ఇతిహాసాల్లో బాలయ్యతో పోటీ పడేవారు లేరు. దర్శకుడు చెప్పినట్లు చేయటం నటుడి ప్రధమ కర్తవ్యం అని అంటారు బాలకృష్ణ. అందుకే కొన్నిసార్లు బాలకృష్ణ సినిమాల్లో కొంత అతిశయోక్తి ఉన్నా… దర్శకులు చెప్పారు.. నేను చేశాను.. అంటారు తప్ప… తనది కాని పనిలో వేలు పెట్టేది లేదనేది బాలయ్య మాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అందుకే… బాలకృష్ణకు పద్మ పురస్కారం అవసరమా అనే వాళ్లకు ఒకటే జవాబు… పురస్కారం వచ్చిన రాకున్నా… నటసింహం అనే పేరు చాలు అంటారు బాలకృష్ణ అభిమానులు. అలాగే జై బాలయ్య అనే మాట ఒక్కటే చాలు… హోరెత్తడానికి అంటారు నటసింహం, యువరత్న నందమూరి బాలకృష్ణ అభిమానులు. ఇంకో విషయం ఏమిటంటే.. సాధారణంగా ఒక సినీనటుడికి వయసు పెరుగుతుంటే అభిమానులు తగ్గిపోతారు. కానీ బాలకృష్ణ విషయంలో మాత్రం అది వేరు. ప్రస్తుత తరంలో కూడా చాలామంది బాలయ్య అభిమానులే. వయోభేదం, ప్రాంతాలకు అతీతంగా బాలకృష్ణ అభిమానులున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్