Friday, September 12, 2025 09:05 PM
Friday, September 12, 2025 09:05 PM
roots

ఇన్కమ్ టాక్స్ ఫోకస్ నుంచి తప్పించుకున్న నాగవంశీ

నాలుగు రోజుల నుంచి ఐటీ అధికారుల సోదాలపై తెలుగు మీడియాతో పాటుగా నేషనల్ మీడియాలో కూడా హడావుడి జరుగుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసిన నిర్మాతలపై ఎక్కువగా ఐటి అధికారులు దృష్టిపెట్టారనే వార్తలు వచ్చాయి. అలాగే.. అభిషేక్ పిక్చర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, మ్యాంగో మీడియా సంస్థలపై కూడా అధికారుల దాడులు కొనసాగాయి. అయితే ఈ దాడుల్లో ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ విషయంలో మాత్రం ఐటీ అధికారులు పెద్దగా దృష్టి పెట్టలేదు అనే ఒపీనియన్ వినపడుతోంది.

Also Read : గవర్నర్ ఫోన్ ట్యాపింగ్.. కీలక సాక్ష్యాలు లభ్యం..!

ఈ మధ్యకాలంలో తక్కువ బడ్జెట్ తో ఎక్కువగా సినిమాలు చేస్తూ భారీ లాభాలను పొందుతున్నారు నాగవంశీ. దేవర సినిమా ఒక్కటే భారీ బడ్జెట్ సినిమా కాగా.. లక్కీ భాస్కర్ తో పాటుగా డాకు మహారాజ్ సినిమా కూడా భారీ లాభాలు తెచ్చి పెట్టాయి. అంతకుముందు డీజే టిల్లు సీక్వెల్ కూడా నాగ వంశీకి మంచి లాభాలే తీసుకొచ్చింది. కానీ ఆయన ప్రకటనలలో విషయంలో మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. డాకు మహారాజ్ కలెక్షన్స్ విషయంలో పెద్దగా ఎనౌన్స్మెంట్లు కూడా చేయలేదు.

Also Read : విసారెడ్డి రాజీనామా పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఐదు రోజుల క్రితం 156 కోట్లు ఆ సినిమా సాధించినట్లు ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. ఆ తర్వాత మళ్లీ పోస్టర్ రిలీజ్ చేయలేదు. ఐటీ అధికారులు భారీ వసూళ్లు వచ్చిన సినిమాలను భారీ బడ్జెట్ సినిమాలు చేసిన నిర్మాతలను ఎక్కువగా ఫోకస్ పెట్టి నాలుగు రోజులు పాటు సోదాలు చేశారు. ఈ సోదాలు నాగ వంశీపై జరగకపోవడం వెనుక కారణం ఏంటి అనేది క్లారిటీ లేకపోయినా సినిమాలో వసూళ్ల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే అనే అభిప్రాయం వినపడుతోంది. అలాగే హీరోలకి ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో కూడా నాగ వంశీ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఆయన చేసే సినిమాలు బడ్జెట్ ఎంత అనేది కూడా బయటకు రావటం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్