ఈ రోజుల్లో సినిమా వాళ్ళు చేసే ప్రకటనలు అన్ని బోగస్ అనే క్లారిటీ స్లోగా జనానికి వస్తుంది. సినిమా రికార్డుల కోసం ఏది పడితే అది పోస్టర్ల రూపంలో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన పుష్ప ది రూల్ సినిమా విషయంలో ఇలాగే హడావుడి జరిగింది. ఈ సినిమాకు భారీగా క్రేజ్ ఉండటంతో ఆ క్రేజ్ ని వాడుకునేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు. ఇక సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత కూడా రికార్డులపై ఏది పడితే అది ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ సినిమా 2000 కోట్ల వరకు వసూలు చేసిందని మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.
Also Read : వైసీపీకి ట్రబుల్ షూటర్స్ షాక్..!
32 రోజుల్లోనే 1831 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసి బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసినట్టు ప్రకటించారు. ఇక తర్వాతి టార్గెట్ అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ సినిమానే అనే ప్రచారం గట్టిగానే జరిగింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో డిస్ట్రిబ్యూటర్ అలాగే నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 సినిమాకు మొత్తం వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కేరళలో తెలుగు సినిమాకు 20 కోట్లు పెట్టి రైట్స్ కొనుగోలు చేశారు. అయితే తాజాగా దీనిపై నట్టి కుమార్ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
Also Read : జరిగిందిదే.. ఐటీ రైడ్స్ పై దిల్ రాజు వ్యాఖ్యలు..!
ఆంధ్రాలో పుష్పా 2 డిస్ట్రిబ్యూటర్స్ తీవ్రంగా నష్టపోయారని ఎవరికీ లాభాలు రాలేదన్నారు. కొన్ని చోట్ల అయితే అసలు సినిమా డిస్ట్రిబ్యూట్ కాలేదని ఎవరు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఆ విషయం తనకు తెలుసు అన్నారు. తెలంగాణలో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయిందని ఆంధ్రలో కాలేదని అన్నారు. నార్త్ ఇండియాలో మాత్రం మంచి కలెక్షన్స్ వచ్చాయని కేరళలో కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కాలేదని తేల్చి చెప్పారు. పుష్ప 2 సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది ఆస్తులు కూడా అమ్మి నష్టాన్ని భరించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.