Friday, September 12, 2025 07:23 PM
Friday, September 12, 2025 07:23 PM
roots

వైసీపీ క్యాడర్ భయం వెనుక కారణం జగన్ రెడ్డేనా..?

రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బాయ్ చెప్పడం ఏమోగానీ వైసీపీ క్యాడర్ లో మాత్రం ఎప్పుడూ లేని ఆందోళన కనబడుతోంది. జగన్ రాజకీయ జీవితంలో విజయసాయిరెడ్డి అత్యంత కీలకపాత్ర పోషించారు. ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు జగన్ ను దగ్గర చేయడంలో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి విజయసాయిరెడ్డిది కీలకపాత్ర. ఆ తర్వాత ఆయనపై కేంద్ర ప్రభుత్వం కేసుల వ్యవహారంలో సైలెంట్ గా ఉండటంలో కూడా విజయసాయిరెడ్డి కీలక భూమిక పోషించారు.

Also Read : అవినాష్ రెడ్డి ని అడ్డంగా బుక్ చేసిన విసారెడ్డి

అందుకే రెండుసార్లు జగన్ విజయసాయిని రాజ్యసభకు పంపించారు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో విజయ సాయి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఇదే వైసీపీ క్యాడర్ ను భయపెడుతోంది జగన్ కు విజయసాయిని కుడి భుజంగా చెబుతారు. వైసిపి సోషల్ మీడియాకు కూడా విజయసాయిరెడ్డి అండగా ఉండేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేయడంతో జగన్ కు కచ్చితంగా.. ఇబ్బందికర పరిణామాలే అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి.

సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నా సరే ఆయన కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం. ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేసే సత్తా ఉన్న నేతకాదు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా లను జగన్ కు దగ్గర చేయడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించి ఎన్నో కేసుల్లో జగన్ ను రక్షిస్తూ వచ్చారు. ఇక పార్టీలో అంతర్గత పోరులో కూడా విజయసాయిరెడ్డి నలిగిపోతు వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ ప్రాధాన్యత ఇవ్వటం విజయసాయికి ఏమాత్రం నచ్చలేదు. అటు వై వి సుబ్బారెడ్డి కూడా విజయసాయిరెడ్డిని పదేపదే ఇబ్బందులు పెట్టారు.

Also Read : విసారెడ్డి రాజీనామా పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఇక 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి విజయసాయికి పోటీ చేసే ఆసక్తి లేకపోయినా ఆయనను పోటీలో నిలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఐదు కోట్లు ఖర్చుపెట్టి ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని విజయసాయిరెడ్డి బాగు చేయించారు. తరుచూ అన్ని పార్టీల ఎంపీలకు ఆయన విందులు కూడా ఇస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీతో కూడా మంచి సంబంధాలే కలిగి ఉన్నారు విజయసాయిరెడ్డి. అలాంటి నేత జగన్ కు దూరం కావడం అంటే కచ్చితంగా పరిణామాలు తీవ్రంగానే మారబోతున్నాయి అనే సంకేతాలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్