హైదరాబాద్ ను ఆక్రమణల ముప్పు నుంచి బయటకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా హైడ్రాను రంగంలోకి దించారు. హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాల్లోని అక్రమ నిర్మాణాలన్నీ నేలమట్టమవుతూ వస్తున్నాయి. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో నగరంలో ప్రజలు బ్రతకలేరంటూ హైడ్రా అడుగులు వేస్తోంది. ఇక తాజాగా హైదరాబాదులో ఉన్న అన్ని చెరువుల సర్వే పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
ఆగస్టు తర్వాత జరిగిన ప్రతి నిర్మాణాన్ని గుర్తించాలని… వారంలో వాటిని కూల్చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు హైడ్రా బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే బీరంగూడా, గాజులరామారం సహా కొన్ని ప్రాంతాల్లో గుర్తించిన చెరువులను సంరక్షించాలని హైడ్రా అధికారులు రెడీ అయిపోయారు. జులై 2024లో హైడ్రా ఏర్పాటు అయిందని దానికి ముందు వాటిని అనుమతి ఉన్నా లేక ఉన్నా కూల్చబోమని… వ్యాపారం కోసం కట్టుకున్న షెడ్లను కూల్చుతామని స్పష్టం చేశారు రంగనాథ్. ఆగస్టు 2024 నుంచి చేపట్టిన నిర్మాణాలు మాత్రం నేలమట్టమేనని హెచ్చరించారు.
Also Read : బ్రేకింగ్: మైత్రీకి మూడింది.. భారీ ఫైన్ పడే ఛాన్స్
చెరువులో ఇల్లు ఉందని అధికారులు వెళ్తే వారి విషయంలో ఆక్రమణదారులు కాస్త హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సానుభూతి పొందే ప్రయత్నం కూడా జరుగుతోంది. దీనిపై కూడా హైడ్రా రంగం సిద్ధం చేసింది. హైడ్రా అధికారుల వద్ద హద్దులను తెలిపే పట్టాలు ఉన్నాయా అని ఆక్రమణదారులు ప్రశ్నించడంతో అందుకు తగ్గ పరిష్కారాలను సిద్ధం చేసుకుని రంగంలోకి దిగుతున్నారు. చెరువులకు.. హద్దులను నిర్ణయిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం.. దానిపై ప్రజల నుంచి ఫిర్యాదులు అభ్యంతరాలను స్వీకరించడం.. వాటిని చట్ట పరిధిలో పరిష్కరించి ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే చెరువుకు నిజమైన హద్దులను నిర్ధారించినట్లు ప్రజల్లో అభిప్రాయం ఉంది.
Also Read : బ్రేకింగ్: ఎన్డియేకి షాక్ ఇచ్చిన నితీష్
అధికారుల్లో కూడా దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి. అదే అదునుగా నీటిపారుదల శాఖ, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందిన పలువురు అధికారులు తుది నోటిఫికేషన్లు విడుదల కాని చెరువుల విషయంలో కాస్త సైలెంట్ గా ఉంటూ వచ్చారు. ఫలితంగా వందలాది చెరువులను ఆక్రమించేశారు. అయితే హైడ్రా కమిషనర్ మాత్రం అలాంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు. చెరువుల్లో నిర్మాణాలను గుర్తించేందుకు ప్రాథమిక నోటిఫికేషన్ సరిపోతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం 51 చెరువులకు మాత్రమే తుది నోటిఫికేషన్ జారీ అయిందని… మిగిలిన అన్నిటికి ప్రాథమిక నోటిఫికేషన్ సరిపోతుందని.. ఆక్రమణలను కూలుస్తామని తేల్చేసారు.