Saturday, September 13, 2025 12:58 AM
Saturday, September 13, 2025 12:58 AM
roots

సరస్వతికి షాక్ ఇచ్చిన సర్కార్.. 25 ఎకరాలు లాగేశారు…!

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఎప్పుడూ ఏదోక రచ్చ జరుగుతూనే ఉంటుంది. తన వ్యాపారాలకు ఏ ఇబ్బందులు లేకుండా అప్పట్లో జగన్ నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సరస్వతి సంస్థల విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చినా అప్పటి ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గలేదు. సరస్వతి సంస్థల కోసం ప్రభుత్వ భూములను లాక్కున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై ప్రభుత్వం మారిన తర్వాత పెద్ద రచ్చ జరిగింది. ఏకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఆ భూములను పరిశీలించారు.

Also Read : మిమ్మల్ని వదల.. సినిమా వాళ్ళను వెంటాడుతున్న ఐటీ

అప్పుడు సరస్వతి సంస్థలకు రాసిచ్చిన ప్రభుత్వ భూములను, రైతుల దగ్గర లాక్కున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నేడు సరస్వతీ పవర్ ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల రద్దు చేసారు. 24.84 ఎకరాలు ఇక ప్రభుత్వానివే అని అధికారులు స్పష్టం చేసారు. మాజీ ముఖ్య మంత్రి జగన్ కి చెందిన సరస్వతీ పవర్, ఇండస్ట్రీస్ కోసం కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వ, ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల రద్దుకు పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆమోద ముద్ర వేసారు.

మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాల ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ దస్తావేజులను రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ కి మాచవరం తహసీల్దార్ క్షమారాణి నివేదిక ఇచ్చారు. ఆ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని పిడుగురాళ్ల సబ్ రిజిస్టర్ కు నివేదిక పంపారు. బుధవారం సబ్ రిజిస్ట్రార్ థంబ్ వేసి రద్దు చేస్తారని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ఇప్పటికే ప్రకటించారు.

Also Read : దావోస్ లో లోకేష్ స్పీడ్.. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్

ఈ వ్యవహారం పై పరిశీలించి నివేదిక ఇవ్వాలని గత ఏడాది నవంబరు 5న జిల్లా కలెక్టర్ ను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించగా.. ఇప్పటికి ఈ నిర్ణయం అమలు అయింది. వేమవరం గ్రామంలో సర్వే నెంబర్ 782లో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో సర్వే నెంబర్ 464-3లో 4.84 ఎకరాలను వెబ్ ల్యాండ్లో పరిశీలించగా.. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రై.లి పేరిట రిజిస్ట్రేషన్ నెం. 3531-2015, 3530-2015, 2015-2305 తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని గుర్తించినట్లు తహసీల్దార్ నివేదికలో స్పష్టం చేయడంతో ఆ రిజిస్ట్రేషన్ లను రద్దు చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్