ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు సాధించే లక్ష్యంతో దావోస్ లో అడుగుపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం.. ప్రముఖ టెక్ దిగ్గజాలను రాష్ట్రం వైపు నడిపించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ స్వయంగా భేటీ అవుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, ప్రవేశపెట్టిన పాలసీలను వివరిస్తున్నారు. ఈ తరుణంలో ఓ వార్త నేషనల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు.
Also Read : ఏపీ, తెలంగాణా మధ్య కృష్ణా జలాల రచ్చ…? పరిష్కారం దొరికేనా…?
వీళ్ళిద్దరి భేటీ జరిగిన ప్రతీసారి రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు అడుగు పెడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ రూపు రేఖలను మార్చిన ఈ కాంబో.. ఇప్పుడు ఏపీ భవిష్యత్తును ఏ విధంగా నడిపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఐటి, వ్యవసాయ రంగాల్లో మైక్రోసాఫ్ట్ సహకారం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మూడోరోజు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్న చంద్రబాబు… బిల్‌గేట్స్ తో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు.
Also Read : ఏబీవీపై కేసు పెట్టాలంటున్న సాక్షీ.. మరి విజయసాయి రెడ్డిని ఏం చేయాలి…?
అమరావతిలో మైక్రోసాఫ్ట్ కార్యాకలాపాలను మొదలుపెట్టే దిశగా ఈ భేటీ జరుగుతుందని మీడియా వర్గాలు అంటున్నాయి. అలాగే ప్రభుత్వ శాఖల్లో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం పెంచే అంశంపై కూడా వీరి మధ్య చర్చ జరగనుంది. బిల్ గేట్స్ తో పాటుగా.. యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈఓలతోనూ సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. ఇదే సమావేశాల్లో గ్రీన్ కోతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుంది. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్- పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరు అవుతారు.