ఏలూరి సాంబశివరావు.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నేత. హ్యాట్రిక్ విజయంతో మంచి ఊపు మీదున్న ఏలూరి.. హడావుడి లేకుండా.. తన పని తాను చేసుకుపోయే స్వభావం ఉన్న నేతల్లో ముందు వరుసలో ఉంటారు. మీడియాలో హడావుడి ఉండదు, సోషల్ మీడియాలో అనవసర రచ్చా ఉండదు.. వ్రుత్తి, ప్రవృత్తి రాజకీయమే అన్నట్టు ఉంటుంది ఏలూరి శైలీ. వైసీపీ హయాంలో ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా సరే.. తలవంచని నాయకుడిగా నిలిచిన ఏలూరి… ఇప్పుడు పర్చూరులో తన బ్రాండ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.
Also Read : కొల్లేరు ప్రక్షాళన సాధ్యమేనా..?
గత ప్రభుత్వ హాయంలో వ్యాపార పరంగా, రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఏలూరి.. పార్టీ నేతలను సమన్వయం చేసుకుని.. ప్రకాశం జిల్లా టీడీపీకి కంచుకోట అని నిరూపించారు. పార్టీలో అసంతృప్తులు ఉన్నా సరే.. జిల్లా తలనొప్పులు దాదాపు అధినేత వరకు వెళ్ళకుండా చక్కబెట్టి.. జిల్లాలో మరోసారి పసుపు జెండా రెపరెపలు ఆడటానికి తన వంతు సహకారం అందించారు. ఏలూరిని ఎదుర్కోవడానికి జగన్ ఎంతమందిని ప్రయోగించినా… టీ కప్పులో తుఫాన్ మాదిరిగానే ఆయా నేతల ప్రభావం ఉండేది.
Also Read : రాజకీయాల్లోకి పీవీ సునీల్.. బిజెపి ప్రోత్సాహంతో కూటమి ప్రయాణం
కులాల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేసినా… నియోజకవర్గంలో సంస్కరణల పేరుతో కొత్త నేతలను దింపినా ఏలూరి ముందు నిలబడలేక సైలెంట్ అయిపోయారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా సరే.. పదవుల కోసం ఆరాటపడని నేతగా ఏలూరికి గుర్తింపు ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఎక్కడా కూడా మంత్రి పదవి కావాలనే పట్టుదలకు పోలేదు ఏలూరి. అలాగే రాజకీయ వైరాలకు, వ్యక్తిగత కక్షలకు దూరంగా ఉండే ఏలూరి.. తనను వేధించిన వాళ్ళ విషయంలో కూడా సైలెంట్ గా ఉంటూ… తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అటు కార్యకర్తలకు, క్షేత్ర స్థాయి నాయకత్వానికి అందుబాటులో ఉంటూ.. పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేస్తూ సాగుతున్నారు ఏలూరి.