ఇండియన్ క్రికెట్ టీం లో.. దక్షిణాఫ్రికా ఫార్ములాను అమలు చేయడానికి బోర్డు రెడీ అయిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. టీమిండియా యువ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ ను కెప్టెన్ గా ఎంపిక చేయాలనే అభిప్రాయాన్ని గంభీర్ బోర్డు పెద్దల ముందు ఉంచడం వెనక వ్యూహం ఇదే అనే కామెంట్స్ వినపడుతున్నాయి. 2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో దక్షిణాఫ్రికా క్రికెట్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుని జట్టుని మళ్లీ గాడిలో పెట్టారు.
Also Read : స్టీల్ ప్లాంట్.. చంద్రబాబు గ్రాండ్ సక్సెస్
స్వయంగా కెప్టెన్ హాన్సి క్రానో అప్పట్లో మ్యాచ్ ఫిక్సింగ్ లో చిక్కుకోవడంతో ఆ తర్వాత ఆ జట్టు ఆల్రౌండర్ షాన్ పోలాక్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అనంతరం 22 ఏళ్ళ వయసులో గ్రేమ్ స్మిత్ ను దక్షిణాఫ్రికా క్రికెట్ టీంకు కెప్టెన్ ను చేశారు. అప్పటికి కేవలం 16 టెస్టులు మాత్రమే ఆడిన అనుభవం ఉన్న గ్రేమ్ స్మిత్ జట్టును విజయవంతంగా నడిపించాడు. బ్యాట్స్మెన్ గా కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ లాడాడు. ఇప్పుడు అదే ఫార్ములాను ఇండియన్ క్రికెట్ టీమ్ లో కూడా తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read : కొల్లేరు ప్రక్షాళన సాధ్యమేనా..?
ప్రస్తుతం జైస్వాల్ వయసు 23 ఏళ్లు. గతంలో కెప్టెన్ గా చేసిన అనుభవం కూడా లేదు. అయినా సరే అతన్ని కెప్టెన్ గా సాన పెట్టాలని… ఇప్పటి నుంచే కెప్టెన్ గా సాన పెడితే 10 ఏళ్లపాటు కెప్టెన్ విషయంలో వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం ఉండకపోవచ్చు అని జట్టు యాజమాన్యం భావిస్తోంది. టెస్ట్ క్రికెట్లో ఇప్పటికే తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో సరైన అనుభవం లేకపోవడంతో.. అభిమానులు అతన్ని కెప్టెన్ గా చేయవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ బూమ్రా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో… అతన్ని కెప్టెన్ గా చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. అందుకే జైస్వాల్ విషయంలో గంభీర్ ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తోంది.