టాలీవుడ్ లో సంక్రాంతి సందడి కంటిన్యూ అవుతోంది. మూడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కావడంతో సంక్రాంతి రెట్టింపు అయిందని చెప్పాలి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ అలాగే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాల మధ్య పోటీ నడుస్తోంది. ఆంధ్రాలో ఈ రెండు సినిమాలు మధ్యనే ఎక్కువగా కలెక్షన్ల పోటీ నెలకొంది. రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా సైలెంట్ గా సైడ్ అయిపోయింది. తాజాగా సంక్రాంతి వస్తున్నాం సినిమా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మరో 200 థియేటర్లను కేటాయించారు డిస్ట్రిబ్యూటర్లు.
Also Read : స్టీల్ ప్లాంట్.. చంద్రబాబు గ్రాండ్ సక్సెస్
దీంతో ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ నందమూరి బాలకృష్ణ అభిమానులు నిర్మాతలపై ఫైర్ అయిపోతున్నారు. సినిమాకు కనీసం థియేటర్లు కూడా దక్కడం లేదని థియేటర్లు వచ్చిన చోట కూడా ఒకటి రెండు షోలు మాత్రమే వేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. సినిమా క్రేజ్ ఎక్కువగా ఉండే రాయలసీమ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో థియేటర్లను కేటాయించే విషయంలో నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోలేదని భవిష్యత్తులో బాలకృష్ణ నిర్మాతలకు ఈ విషయంలో కఠినంగా చెప్పాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
Also Read : తులసిబాబుపై ప్రేమ.. ఎమ్మెల్యేపై అధిష్టానం సీరియస్…?
నిర్మాత దిల్ రాజు తన సినిమాల కోసం బాలయ్య సినిమాను ఇబ్బంది పెడుతున్నారని మెగా మాఫియా మరోసారి రంగంలోకి దిగింది అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేతలపై కూడా ఫైర్ అయిపోతున్నారు బాలయ్య ఫ్యాన్స్. సినిమా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని థియేటర్ లు కేటాయించలేనప్పుడు సినిమా చేయడం అనవసరం అంటూ బూతులు తిట్టే పరిస్థితి నెలకొంది.