విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అనుమానాలకు కేంద్రం తెరదించింది. స్టీల్‌ప్లాంట్‌కు భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. స్టీల్ ప్లాంట్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కూడా ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 7 నెలలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై ఇప్పటికే చాలా సార్లు కేంద్రంతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రధానిని సీఎం చంద్రబాబు కలిసిన ప్రతిసారి కూడా ఇదే విషయంపై చర్చించారు.
Also Read : చిరంజీవి కి రాజ్యసభ ఆఫర్.. ఢిల్లీలో డీల్ ఫైనల్
వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్‌ప్లాంట్‌కు 11 వేల 500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు స్టీల్‌ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. దాంతో స్టీల్‌ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం 11 వేల 500 కోట్లతో కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా తీవ్రంగా కృషి చేశారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడే స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఇక కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తరచూ ప్రధాని మోదీతో ఇదే విషయంపై చర్చించారు. విశాఖ ఉక్కు… ఆంధ్రుల హక్కు అనే నినాదం వల్లే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో ఆదుకునేందుకు సొంతంగా గనులు కేటాయించాలని ఇప్పటికే గనుల శాఖ మంత్రిని కోరారు.
Also Read : కేబినెట్‌లో క్లారిటీ వస్తుందా..?
కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వల్ల స్టీల్ ప్లాంట్‌కు అన్ని విధాలుగా లాభం జరుగుతుందంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఆర్థిక ప్యాకేజీ ప్రకటనకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.