Friday, September 12, 2025 09:01 PM
Friday, September 12, 2025 09:01 PM
roots

ఏపీకి అమిత్ షా.. పక్కా పొలిటికల్ టూర్…?

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర పెద్దల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు వచ్చి రెండు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడితే తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈనెల 18న ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖకు సంబంధించి పలు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకునే అమిత్ షా అదే రోజు రాత్రి సీఎం చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసే ప్రత్యేక విందుకు హాజరవుతారు.

Also Read : పెండింగ్ బిల్లుల పైనే ఫోకస్.. బాబు ప్లానింగ్ ఇదే..!

అనంతరం విజయవాడ హోటల్ కు చేరుకొని 19వ తేదీ ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ఆయన ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరు లో నిర్మించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తో పాటుగా పదో బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపులను అమిత్ షా ప్రారంభించనున్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఇవి వస్తాయి. ఇక అమిత్ షా పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది.

Also Read : ‘సీఎం ఫెలోస్’.. ఏంటి.. ఎలా పనిచేస్తుంది?

ఈ భేటీకి రాజకీయ పరంగా కూడా ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న నేపథ్యంలో వీరి మధ్య ఏ చర్చలు జరుగుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వైఎస్ఆర్సిపి నిర్వాకాలపైనే చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ హయాంలో జరిగిన అనేక అవకతవగలపై నివేదికలను ఇప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్నారు. అందులో కొన్నింటిని కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటి పైన వీరి ముగ్గురి మధ్య భేటీ జరిగే అవకాశం ఉండవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. పాలనా అంశాల కంటే రాజకీయపరమైన అంశాలపైనే ఎక్కువగా అమిత్ షా ఫోకస్ చేస్తారు. దీనితో ఈ పర్యటన పక్కా పొలిటికల్ టూర్ అని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్