తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్టు చేసే విషయంలో రాష్ట్ర, జాతీయ దర్యాప్తు సంస్థలు ఏ నిర్ణయం తీసుకుంటాయి అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. వారం రోజుల క్రితం కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. దాదాపు 85 ప్రశ్నలను ఆరు గంటల పాటు కేటీఆర్ ను అడిగారు అధికారులు. అదే రోజు ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ ఆరోజు సాయంత్రమే కేటీఆర్ బయటికి వచ్చేసారు. విచారణకు ముందు కంగారుగా కనబడిన కేటీఆర్ విచారణ తర్వాత మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు.
Also Read : రైతు భరోసా మోసాలకు చెక్.. రేవంత్ కీలక అడుగులు…!
ఇక తాజాగా ఆయనను జాతీయ దర్యాప్తు సంస్థ ఈ డి విచారిస్తోంది. నిధుల మళ్లింపు విషయంలో ముందుగానే డబ్బులు చెల్లించిన అంశంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు. ఇక ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కు షాక్ తగిలింది. ఫార్ములా ఈ రేస్ విషయంలో నమోదైన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేము అని తేల్చి చెప్పింది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసారు.
Also Read : వైసీపీకి వరుస అవకాశాలు ఇస్తున్న టిడిపి..!
దీనికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించడంతో ఈ నెల 8న ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పలు వాదనలు విన్న తర్వాత తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కేటీఆర్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉండటంతోనే ఏసీబీ ఈ విషయంలో సైలెంట్ అయిందని భావిస్తున్నారు. ఆయనను విచారించే విషయంలో ఈడీ అధికారులు పక్కా ప్లానింగ్ తో దిగారు. ఈడీ కార్యాలయం బయట భారీగా భద్రతను మోహరించారు. కేంద్ర బలగాల పహారాలో ఈ విచారణ జరుగుతుంది. బీఆర్ఎస్ నేతలు కొందరిని ఇప్పటికే పలువురుని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉండటంతోనే ఏసీబీ కేటీఆర్ ను అరెస్టు చేయడం లేదని మీడియా వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతుంది.




