Saturday, September 13, 2025 03:06 AM
Saturday, September 13, 2025 03:06 AM
roots

బొత్తిగా భయం లేకుండా పోయింది..!

బొత్తిగా భయం లేకుండా పోయింది… ఈమాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన వారితో, అధినేతను బూతులు తిట్టిన వారితోనే ఇప్పుడు టీడీపీ నేతలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం సేకరించిన అధినేత చంద్రబాబు… ఆయా నేతలకు స్వయంగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదు. పైగా కొంతమంది నేతలైతే మాట్లాడితే తప్పేంటి అని ఎదురు వాదిస్తున్నారు కూడా.

గత వైసీపీ ప్రభుత్వంలో టార్గెట్ చంద్రబాబు, లోకేష్ అన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళల్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అప్పటి వరకు టిడిపి అధినేతపై పొగడ్తల వర్షం కురిపించారు వంశీ. కానీ వైసీపీలో తీరిన తర్వాత అదే చంద్రబాబుపై నోరు పారేసుకున్నారు. చివరికి వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. ఒక దశలో టిడిపి లీడర్ కనిపిస్తే కొట్టండి అనేలా తన కేడర్ ను ఆదేశించారు. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా వల్లభనేని వంశీ పై చర్యలు ఉంటాయని అందరూ భావించారు. కానీ టిడిపిలోని కొందరు నాయకులు ఇప్పుడు వంశీని కాపాడుతున్నారనే మాట బలంగా వినిపిస్తుంది. వంశీకి మాజీ ఎంపీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ మద్దతిస్తున్నట్టుగా ప్రస్తుతం టిడిపిలో చర్చ జరుగుతుంది. పోలీసుల కదలికలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎప్పటికప్పుడు కొనకళ్ళ స్వయంగా వంశీకి చేరవేస్తున్నారని… అందుకే ఏడు నెలలు గడిచిన వంశీని ప్రభుత్వం ఏం చేయలేకపోతుందనే మాట బలంగా వినిపిస్తోంది.

Also Read : సంక్రాంతి విన్నర్ బాలయ్యే..!

ఇక మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పై హత్యాయత్నం కేసులో నిందితుడైన అప్పటి సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ ప్రధాన అనుచరుడు తులసి బాబును ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. తులసి బాబును గుంటూరులో కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అక్కడికి చేరుకున్నారు. కోర్టు ఆవరణలోనే అందరూ చూస్తుండగానే దాదాపు గంటసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. తులసి బాబును న్యాయమూర్తి ఇంటి వద్దకు పోలీసులు తీసుకెళ్లిన తర్వాత ఎమ్మెల్యే రాము అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తులసి బాబు వైసీపీ అభిమాని అనేది అందరికీ తెలిసిన విషయం. ఓ కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తితో టిడిపి ఎమ్మెల్యేకు ఏం పని అని ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడితో గంటపాటు అందరి ముందు చర్చించాల్సిన అవసరం ఏంటని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.

Also Read : ఒక్కొక్కడి అంతు చూస్తా.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఇక రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తీరుపై అధినేత చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. తరచూ వైసిపి లోని నేతలతో ఆదిరెడ్డి వాసు భేటీ అవుతున్నారనేది రాజమండ్రిలో బలంగా వినిపిస్తున్న మాట. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో వాసుకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని.. అందుకే హైదరాబాదులో తరచూ సమావేశం అవుతున్నట్టు పుకార్లు. అలాగే రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడితో పాటు మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ తో కూడా వాసు వ్యాపారాలు చేస్తున్నారనేది టిడిపి నేతలే చేస్తున్న ఆరోపణలు. ఇసుక, మద్యం వ్యాపారాల్లో వైసిపి నేతలతో వాసు లావాదేవీలు కొనసాగిస్తున్నారని ఇప్పటికే చంద్రబాబుకు గోరంట్ల వంటి సీనియర్ నేతలు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు కూడా. కింజరాపు ఇంటి అల్లుడు అనే కారణంతో వాసు తీరును చంద్రబాబు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి తన బంధువులు కావడంతో తనను ఏమీ చేయలేరనే ధీమాతో వాసు వ్యవహరిస్తున్నారనేది రాజమండ్రి వాసుల ఆరోపణ.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్