పిఠాపురం పర్యటనలో భాగంగా ఓల్డ్ బస్టాండ్ హై స్కూల్ లో పల్లెపండుగ వారోత్సవాలు ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు పనిచేయడం తప్ప విజయం గురించి తెలీదని.. అలాంటి నాకు పిఠాపురం ప్రజలు నాకు ఘన విజయం ఇచ్చారని.. అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. తిరుపతిలో జరిగిన ఘటన చాల భాదాకరమని.. సంక్రాంతికి ఊరంతా పందిరి వేద్దాం అనుకున్నాను అన్నారు.
Also Read: టిటిడి లో ఎవరి పై వేటు పడనుంది..?
ఆ విషాద ఘటన నేపథ్యంలో ఈరోజు వేడుకలుకు దూరంగా ఉన్నాను… వచ్చే దసరాకి భారీగా చేద్దామన్నారు. నేను తెగించి రాజకీయాల్లోకి వచ్చాను… భయపడే వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదన్నారు పవన్. మీరు ఇచ్చిన గెలుపుతోనే టీటీడీ చైర్మన్ అయినా… ఈవో అయినా.. చంద్రబాబు అయినా.. నేను అయినా… అందుకే క్షమాపణ చెప్పాను అన్నారు పవన్. టిటిడి అధికారులు కూడా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. తిరుపతి బాధితులు ఆస్పత్రిలో మాట్లాడుతుంటే నాకు కన్నీళ్లు వచ్చాయన్నారు.

టిటిడి పాలక మండలిలో చైర్మన్ బిఆర్ నాయుడు సహా బయటకు వచ్చి సభ్యులు అందరూ బాధితుల బాధ వింటే తెలుస్తుంది…ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలన్నారు. సరైన ఆలోచన లేక 11 వందల మంది పోలీసులు ఏమీ చెయ్యలేక పోయారని వ్యాఖ్యానించారు. పిఠాపురంలో దొంగతనాలు పెరిగాయి.. గంజాయి వాడకం పెరిగింది.. తుని నుండి వచ్చిన కొందరు మారుస్తున్నారు… అని నా దృష్టికి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేసారు పవన్. పిఠాపురం నియోజకవర్గంలో ఈవ్ టిజింగ్ పెరిగిపోయింది అని పలు ఫిర్యాదు వచ్చాయన్నారు పవన్.
Also Read: పిలుపు దూరంలో మంత్రి.. ఏపీ కేబినేట్ లో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్..!
రాత్రి వేళల్లో బైక్ విన్యాసాలు పెరిగాయి… పోలీసులు దృష్టి పెట్టాలని పవన్ ఆదేశించారు. సీటిల్మెంట్లు పోలీస్ స్టేషన్ లో కాకుండా లాయర్ ల వద్ద పెట్టండని సలహా ఇచ్చారు. తిరుపతిలో డిఎస్పీ సరిగ్గా పని చేసి ఉంటే ఎస్పీ బలి అయ్యేవారు కాదన్నారు. నాలాంటి వాడు రోడ్డు మీదకు వస్తే ఎవరికి నిద్రాహారాలు ఉండవని, గౌరవం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేసారు. నా నియోజక వర్గం పిఠాపురంలో ఆడపిల్లలపై ఈవ్ టీజింగ్ చేస్తే తొక్కి నారా తీస్తా పిచ్చా వేషాలు వేస్తే అంటూ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజక వర్గంలో క్రిమినల్స్ కి కులం లేదు.. ప్రజా ప్రతినిధులకు కులం లేదన్నారు పవన్.