వై నాట్ 175 అంటూ గొప్పగా ఎన్నికలకు వెళ్ళిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి గట్టి షాక్ తగిలింది. చివరికి ప్రతిపక్ష హోదా కూడా జగన్ కు రాలేదు. కేవలం 11 స్థానాలు మాత్రమే రావడంతో అసెంబ్లీకి వచ్చేందుకు కూడా జగన్ కు ముఖం చెల్లటం లేదు. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే కుంటి సాకుతో అసెంబ్లీ సమావేశాలకు జగన్ డుమ్మా కొడుతున్నారు. జగన్ సర్కార్ చేసిన వైఫల్యాలను ప్రధానంగా వివరించిన కూటమి పార్టీ నేతలు ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, పైగా ఇచ్చిన హామీలను కనీసం అమలు చేయలేదని ఎన్నికలలో ప్రధానంగా ఆరోపించారు.
Also Read: టిటిడి లో ఎవరి పై వేటు పడనుంది..?
ఇదే సమయంలో సూపర్ సిక్స్ పరకాల పేరుతో ఓటర్లను తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు ఆకర్షించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ నేతలు హామీ ఇచ్చారు. కానీ వాటిల్లో ఇప్పటివరకు కేవలం రెండు మాత్రమే కూటమి సర్కార్ అమలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే జులై నెల నుంచే రూ.వెయ్యి పెంచి అందిస్తున్నారు. అలాగే దీపం 2 పధకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తోంది కూటమి ప్రభుత్వం.
Also Read: మరోసారి అదే నమ్ముకున్న జగన్..!
అంతే తప్ప మిగిలిన పథకాల అమలుపై చంద్రబాబు సర్కార్ ఇప్పటికీ కసరత్తు చేస్తూనే ఉంది. వాస్తవానికి జూన్ 4న ఫలితాలు వస్తాయి… జూన్ 5 నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అంటూ టిడిపి నేతలు ఎన్నికలప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఏడు నెలలు గడిచినా కూడా ఇప్పటికీ ఫ్రీ బస్సు స్కీం పై అధ్యయనం చేస్తూనే ఉన్నారు. అలాగే రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, సంక్రాంతి కానుక ఇస్తానని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. కానీ ఇప్పటికే క్రిస్మస్, సంక్రాంతి పండుగల కానుకల ప్రస్తావనే లేదు. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇదే అంశాలను వైసిపి ప్రధాన ప్రచారంశాలుగా ప్రస్తావిస్తుంది.