తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఆ పార్టీ కార్యకర్తలు చాలా ఎదురు చూస్తున్నారు. గులాబీ పార్టీ నాయకులు కూడా ఆయన ఎప్పుడు బయటకు వస్తారని కళ్ళకు ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూసే పరిస్థితి. ఒకవైపున అన్ని పార్టీలు భారత రాష్ట్ర సమితిని టార్గెట్ చేస్తుంటే కేసీఆర్ నుంచి రియాక్షన్ ఉండటం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా అసలు స్పష్టత రావటం లేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎన్నోసార్లు బయటికి వచ్చారు. ఉద్యమాలు చేశారు..
Also Read : వైసీపీ లో శ్యామల డామినేషన్.. మండిపడుతున్న నాయకులు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. బిజెపి అధికారంలో ఉన్నా సరే ఎవరికీ భయపడకుండా ఉద్యమాలు దీక్షలు చేసిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం అసలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. ఎవరికి అందుబాటులో ఉండటం లేదు. 1989 నుంచి 1994 వరకు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేసీఆర్ చాలా కష్టపడే వారు. సభకు కూడా హాజరై ప్రభుత్వాన్ని పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. సొంత పార్టీ పెట్టిన తర్వాత కూడా కేసీఆర్ అలాగే కష్టపడ్డారు. ఎంపీగా ఉన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టడానికి అన్ని అవకాశాలను కేసీఆర్ వాడుకునేవారు.
అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడటానికి మాత్రం ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో శక్తివంతంగా ఉన్న సమయంలోనే.. ఆ పార్టీపై పోరాటం చేసిన కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పై పోరాటం చేయడానికి గాని… ఆయనపై అసలు ఒక్క విమర్శ చేయడానికి గాని ముందుకు రావటం లేదు. దీనితో అసలు కేసీఆర్ కు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉందా అనేది అర్థం కావడం లేదు. గతంలో కేసీఆర్ చాలాసార్లు ఇలాగే ప్రవర్తించేవారు. చాన్నాళ్లపాటు సైలెంట్ గా ఉండి ఎప్పుడో ఒక మీడియా సమావేశం పెట్టి ఫోకస్ మొత్తం తన వైపుకు తిప్పుకునే వారు.
Also Read : తురగా కిషోర్ బెండు తీస్తారా..?
కానీ ఇప్పుడు మాత్రం సినిమా అలా కనపడటం లేదు. అసలు కేసీఆర్ ఇక రారు బయటికి అనే క్లారిటీ కూడా చాలామందికి వచ్చేస్తుంది. కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత కేసీఆర్ ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా అంత కంఫర్టబుల్ గా ఉన్నట్టేమి కనపడలేదు. శాసనసభ సమావేశాలకు ప్రతిపక్ష నేత హోదాలో ఒక్కసారి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. ఒకసారి హాజరైనా అది తూతూ మంత్రంగానే మాట్లాడి వెళ్లిపోయారు. కేటీఆర్, హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి ఇలా ఎవరు మాట్లాడినా సరే కేసీఆర్ మాట్లాడకపోతే గులాబీ పార్టీ కార్యకర్తలకు జోష్ అనేది ఉండదు.
కాంగ్రెస్ సర్కార్ తాట తీయాలి అంటే కచ్చితంగా అది కేసిఆర్ తోనే సాధ్యమవుతుంది. రైతు భరోసా సహా ఎన్నో సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజల నుంచి విమర్శలు ఉన్నాయి. అయినా సరే గులాబీ బాస్ మాత్రం ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడే సాహసం చేయడం లేదు. ఆయన జూలు విదిలించే అవకాశం ఉందని ఆ పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నా పెద్దగా ఫలించడం లేదు.




