Saturday, September 13, 2025 12:53 AM
Saturday, September 13, 2025 12:53 AM
roots

గవాస్కర్ కి అవమానం.. క్రికెట్ ఆస్ట్రేలియా క్లారిటీ

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. త్రీ – 1 తేడాతో ఐదు టెస్టుల సీరిస్ ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. చివరిదైన సిడ్నీ టెస్ట్ లో మెరుగైన ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా.. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీనితో 10 ఏళ్ల తర్వాత ఆ ట్రోఫీని కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. అయితే ఇక్కడ ట్రోఫీ ప్రధానం చేసే సమయంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కు అవమానం జరిగింది. ట్రోఫీని ప్రధానం చేసే సమయంలో తనును పిలవకపోవడం పట్ల గవాస్కర్ అసహనం వ్యక్తం చేశారు.

Also Read : తురగా కిషోర్‌ బెండు తీస్తారా..?

విజేత ఆస్ట్రేలియా కు ట్రోఫీని బహుకరించే సమయంలో వేదికపై తాను కూడా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో మైదానంలోనే ఉన్నానని, బాగా ఆడింది కాబట్టి ఆస్ట్రేలియా గెలిచిందని.. అయితే ఏంటి ఈ సీరీస్ బోర్డర్ గవాస్కర్ పేరుతో జరిగింది కాబట్టి తన స్నేహితుడు బోర్డర్ తో కలిసి బహుమతిని ప్రధానం చేస్తే చాలా సంతోషంగా ఉండేవాడిని అన్నారు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా రియాక్ట్ అయింది. చివరిది అయిన సిడ్నీ టెస్ట్ లో భారత్ గెలిచి ట్రోఫీని తిరిగి దక్కించుకుంటే గవాస్కర్ ను వేదికపైకి పిలిచే వాళ్ళమని పేర్కొంది.

Also Read :విశాఖ కు మోడీ.. ఏపీ కి వరాలిస్తాడా..?

అసలు ఈ విషయం సునీల్ గవాస్కర్ కు కూడా తెలుసు అని పేర్కొంది ఆసీస్. పదేళ్ల తర్వాత ఈ సీరీస్ ను తమ జట్టు సొంతం చేసుకుంది అని అందుకే అలెన్ బోర్డర్ తో తాము ట్రోఫీని ప్రధానం చేయించామని క్రికెట్ ఆస్ట్రేలియా వివరణ ఇచ్చింది. ఇక 1996 – 97 సీజన్ నుంచి ఈ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. అప్పటినుంచి టెస్ట్ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మక సిరీస్ గా ఇది కొనసాగుతోంది. ఈ సీరీస్ ఓటమితో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే అర్హత కోల్పోయింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్