Saturday, September 13, 2025 03:06 AM
Saturday, September 13, 2025 03:06 AM
roots

ఒక్క రోజే 2 వేల మందితో చంద్రబాబు.. కుటుంబానికి దూరంగా.. క్యాడర్ కు దగ్గరగా…!

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఒక్క రోజే రెండు వేల మందిని కలిసి చరిత్ర సృష్టించారు. వేడుకలకు దూరంగా ప్రజలకు దగ్గరగా తొలి రోజును గడిపారు చంద్రబాబు నాయుడు. నూతన సంవత్సర తొలి రోజున దాదాపు 2 వేల మందిని కలిసారు సిఎం చంద్రబాబు. 1,600 మంది పేదలకు రూ.24 కోట్లు విడుదల చేసే సిఎంఆర్ఎఫ్ ఫైల్ పై సంతకంతో నూతన సంవత్సరం మొదటి రోజును గ్రాండ్ గా ప్రారంభించారు. ఉదయం 10.45 గంటలకు టీటీడీ అర్చకులతో ఆశీర్వాదం తీసుకున్నారు చంద్రబాబు.

Also Read : కూటమిలో విభేదాలు.. పరిష్కారం ఏమిటో..!

11 గంటలకు ఉదయం ఇంట్లో ఐఎఎస్,ఐపిఎస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చి… కాసేపు వారితో గడిపారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12.20- తరువాత దుర్గగుడిలో అమ్మవారి దర్శనం కోసం వెళ్లి మీడియా ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1.30 గంటలకు అక్కడి నుంచి గవర్నర్ వద్దకు వెళ్లి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు చంద్రబాబు. మధ్యాహ్నం 2.30 -తరువాత మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై గంటపాటు చిట్ చాట్ నిర్వహించారు.

Also Read : ఏపీలో గేమ్ చేంజ్ చేయనున్న పవన్ కళ్యాణ్

ఇక మధ్యాహ్నం 3.15- తరువాత పార్టీ కార్యాలయానికి వెళ్లిన సిఎం…దాదాపు 1500 మందితో పార్టీ కార్యాలయంలో ఫోటోలు దిగడం గమనార్హం. ప్రతి ఒక్కరి నుంచి విషెస్ స్వీకరించారు. సాయంత్రం ఆరు గంటలకు అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో భేటీ అయ్యారు. సాయంత్రం 6.15 -తరువాత సచివాలయం మొదటి బ్లాక్ లో ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులతో గంటపాటు చంద్రబాబు మీటింగ్ నిర్వహించారు. తన ఆలోచనలు చెప్పి….వారి సూచనలు తీసుకున్నారు. 7.15 గంటలకు అనంతరం నేటి క్యాబినెట్ అజెండాపై సిఎం కార్యాలయ అధికారులతో చర్చించి…మరి కొంత మంది నాయకులను సచివాలయంలోనే కలిసి ఉండవల్లి ఇంటికి వెళ్ళారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్