ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోల విషయం పక్కన పెడితే టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగానే ఉందా…? అంటే అవును అనే సమాధానం వినపడుతోంది. సోమవారం ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమ సమస్యలు కొన్ని వీరి మధ్య చర్చకు వచ్చాయి. ఇక ఇదే సమయంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ను దిల్ రాజు ఆహ్వానించారు.
Also Read: అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిల్ ఆహ్వానానికి పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు. రాజమండ్రిలో జరగబోతున్న ఈవెంట్ కు స్వయంగా పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతారు. ఆదివారం సాయంత్రం చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ ను దిల్ రాజు ఒప్పించారు. ఇక సినిమా టికెట్ ధరల విషయంలో కూడా పవన్ నుంచి సానుకూలంగానే ఒక డెసిషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని, అయితే టికెట్ ధరల పెంపు విషయంలో మాత్రం ఎక్కువగా పెంచకపోవచ్చు అని ఆయన క్లారిటీగా చెప్పారట. మరి ఏ స్థాయి వరకు పెంచుకుంటారు అన్న విషయం పై సిఎం తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపినట్లు సమాచారం.
Also Read: బాలయ్య కోసం ఎన్టీఆర్.. నాగ వంశీ ప్లానింగ్
ఇక బెనిఫిట్ షోల విషయంలో సానుకూలంగా స్పందించినా.. అనుమతి ఇచ్చినా ఉదయం నాలుగు గంటల నుంచి మాత్రమే ఉంటాయని, అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఇచ్చే సమస్య లేదని పవన్ కళ్యాణ్ దిల్ రాజు వద్ద తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అది కూడా కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం అని… విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లోనే అనుమతులు ఇస్తామని దిల్ రాజు వద్ద పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఇక ఇదే విషయమై తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఏదో ఒక రకంగా ఒప్పించేందుకు దిల్ రాజు సిద్ధమవుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.