Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

బాలయ్య కోసం ఎన్టీఆర్.. నాగ వంశీ ప్లానింగ్

నందమూరి కుటుంబాన్ని ఇప్పుడు మళ్లీ కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా నందమూరి కుటుంబంతో విభేదించి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గర చేయడానికి ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త సానుకూలంగా కనపడుతున్న జూనియర్ ఎన్టీఆర్… ఇప్పుడు నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు అయ్యే అవకాశం ఉంది.

Also Read : జారిపోతున్న మ్యాచ్ ను నిలబెట్టాడు.. ది బూమ్రా…!

తాజాగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. దేవర సినిమా సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కు బాలకృష్ణ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. దీనితో ఎన్టీఆర్ కూడా కాస్త సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి అడుగుపెట్టే సమయంలో సోషల్ మీడియాలో అభినందనలు కూడా తెలిపాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు నాగ వంశీ అడగటంతో డాకు మహారాజు సినిమా ప్రమోషన్ కోసం వచ్చేందుకు సిద్ధమయ్యాడు. వీరిద్దరినీ ఒకే వేదిక పై చూసి చాలా రోజులవ్వడంతో అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న వార్త నిజం అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read : పవన్ తో భేటీ.. టాలీవుడ్‌లో టెన్షన్..!

త్వరలోనే జరగనున్న ఈ మెగా ఈవెంట్ కు.. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహిస్తారు అనే దానిపై స్పష్టత లేకపోయినా దాదాపుగా విజయవాడలోనే ప్లాన్ చేసే అవకాశం ఉంది. సిద్ధార్థ కాలేజ్ గ్రౌండ్స్ లో డాకు మహారాజ్ సినిమా ఈవెంట్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అరవింద సమేత సినిమా తర్వాత పెద్దగా నందమూరి ఫ్యామిలీ కలిసినట్టు ఎక్కడా కనపడలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా నందమూరి అభిమానుల మద్దతు కోరుకుంటున్నట్లు కనపడుతుంది. మెగా ఫాన్స్ దేవర సినిమా సమయంలో ఓ రేంజ్ లో టార్గెట్ చేయడం ఆ సినిమా వసూళ్లపై కూడా ప్రభావం పడింది. అందుకే ఎన్టీఆర్ కాస్త జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్