ఆంధ్రప్రదేశ్ నుంచి గత అయిదేళ్లుగా బియ్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరిగింది. కాకినాడ పోర్ట్ ను అక్రమ బియ్యం రవాణాకు అడ్డాగా మార్చింది ఆ ముఠా అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. వేల టన్నుల రేషన్ బియ్యం సముద్రం మీదుగా దేశం దాటించేసారు అనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యారు. ఇక దీనిపై ఇప్పుడు విచారణ వేగవంతం చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై విచారణకు ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం స్థానంలో రాష్ట్రప్రభుత్వం త్వరలో కొత్త సిట్ ఏర్పాటు చేయనుంది.
Also Read : గరికపాటికి రేవంత్ కీలక పదవి…!
సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఒక ఎస్పీ, నలుగురు డీఎస్పీలతో ఈ నెల 6న ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. వైసిపి అనుకూలురుగా ముద్రపడ్డ డీఎస్పీలు టి.అశోకవర్ధన్ రెడ్డి, ఎం.బాలసుందరరావు, ఆర్.గోవిందరావులను దీనిలో సభ్యులుగా నియమించడంపై విమర్శలు వచ్చాయి. వారిని తప్పించి, కొత్తగా మరో సిట్ ఏర్పాటు చేసారు. ముగ్గురు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లతో పాటు పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖాధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నుంచి కొందరినీ సిట్ లోకి తీసుకుంటున్నారు.
Also Read : రేవంత్ ప్రకటనతో.. చంద్రబాబుకు ఇబ్బందులు..!
ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేసారు. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. కాకినాడ జిల్లాలోని కరప, కోరింగ, పోర్ట్, ఇంద్రపాలెం పోలీసుస్టేషన్ల పరిధిలో జూన్, జులై నెలల్లో 13 కేసులు నమోదు చేసారు. ఈ నెల 6న ఏర్పాటైన సిట్ కి ఈ 13 కేసుల దర్యాప్తు బాధ్యతలనే ప్రభుత్వం అప్పగించింది. ఇప్పుడు వాటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మరికొన్ని ముఖ్యమైన రేషన్ బియ్యం స్మగ్లింగ్ కేసులనూ అప్పగించలనే ఆలోచనలో ఉన్నారు.
Also Read : గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న శ్రీలక్ష్మి
వ్యవస్థీకృత స్మగ్లింగ్ మూలాలు బయటపెట్టడం ప్రధాన సూత్రధారులు, పాత్రధారులను గుర్తించడం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే బాధ్యతలు సిట్ కి అప్పగించబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కూడా బియ్యం అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపై ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది.