ఇద్దరు ఇన్.. ఇద్దరు అవుట్… ఇప్పుడు ఇదే మాట ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఆరు నెలలు దాటింది. చంద్రబాబు సారధ్యంలోని మంత్రివర్గంలో ఒక బెర్త్ ఖాళీగా ఉంది. దానిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుతో భర్తీ చేస్తున్నట్లు ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు కూడా క్యాబినెట్ బెర్త్ ఖాయమనే మాట వైరల్‌గా మారింది. అయితే ఇదే సమయంలో ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న ఇద్దరు మంత్రులకు హూస్టింగ్ తప్పదంటున్నారు పార్టీ నేతలు.
Also Read : నేను తగ్గను.. బెనిఫిట్ షోస్ ఉండవు: రేవంత్ క్లారిటీ
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చాలామంది సీనియర్లను పక్కనపెట్టి మరి యువకులకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. యనమల, గోరంట్ల, కళా వెంకట్రావు, ధూళ్లిపాళ్ల వంటి నేతలను పక్కన పెట్టిన చంద్రబాబు… వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ వంటి కొత్తవారిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఇలా ఇవ్వడంతో సీనియర్లు కాస్త అసంతృప్తితో ఉన్నారు. అయితే తొలి నుంచి ఈ ఇద్దరిపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సభ్యత్వ నమోదు విషయంలో సుభాష్‌కు చంద్రబాబు చేసిన హెచ్చరికలు అప్పట్లో పెద్ద దుమారమే లేపాయి కూడా. వీరిద్దరికే పలుమార్లు హెచ్చరికలు చేసినా సరే… మార్పు మాత్రం కనిపించటం లేదని ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలోనే చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు కూడా దీంతో ఈ ఇద్దరిపై వేటు ఖాయమనే మాట వినిపిస్తోంది.
Also Read : టోకెన్ ఉంటేనే శ్రీవారి దర్శనం.. టీటీడీ క్లారిటీ..!
మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ త్వరలోనే ఉంటుందని ఇప్పటికే పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే జనవరి 8న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండొచ్చని సచివాలయ వర్గాలు చెపబుతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త ఏడాదిలో మంత్రివర్గంలోకి ఇద్దరు కొత్తవారిని తీసుకుంటే.. ఇద్దరు జూనియర్స్‌కు చంద్రబాబు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు.