Monday, October 27, 2025 10:28 PM
Monday, October 27, 2025 10:28 PM
roots

రేవంత్ తో మీటింగ్ దూరంగా చిరంజీవి.. ఇందుకేనా?

కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు భేటీ అయ్యారు. ముందు ప్రకటించిన సమయానికే ఈ భేటీ ప్రారంభమైంది. కమాండో కంట్రోల్ రూమ్ కు… నటులు నాగార్జున, వెంకటేశ్ , నితిన్ , కిరణ్ అబ్బవరం,సిద్ధూ జొన్నలగడ్డ చేరుకున్నారు. ఇక దర్శకుల నుంచి త్రివిక్రమ్ , కొరటాల శివ, వంశీపైడిపల్లి,అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్ , హరీశ్ శంకర్ , ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట చేరుకున్నారు. నిర్మాతల నుంచి… నిర్మాతలు అల్లు అరవింద్ , సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కళ్యాణ్ , గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్ , కె.ఎల్ నారాయణ, మైత్రీ రవి, నవీన్ చేరుకున్నారు.

Also read : ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ఖరారైతే తిరుగులేదు

సినీ పెద్దల భేటీకి చిరంజీవి దూరంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇండస్ట్రీ పెద్దగా… ప్రతి సందర్భంలో కనిపించే మెగాస్టార్ చిరంజీవి సీఎం తో టాలీవుడ్ బృందం మీటింగ్ కి దూరంగా ఉన్నారు. గతంలో జగన్ తో మీటింగ్ కి స్వయంగా సారధ్యం వహించిన చిరంజీవి.. జగన్ తో తన స్థాయి తగ్గించుకుని మరీ విజ్ఞప్తులు చేసారు. కాని ఇప్పుడు రేవంత్ తో మీటింగ్ కి దూరం అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట,అల్లు అర్జున్ అరెస్ట్ వివాదానికి మొదటి నుంచి మౌనంగా ఉన్న చిరు… అసలు ఎక్కడా ఆ వ్యవహారంపై మాట్లాడలేదు.

ఇప్పుడు సీఎంతో జరుగుతున్న సమావేశం అత్యంత కీలకం. ఒకరకంగా భారీ బడ్జెట్ సినిమాల భవిష్యత్తును తెలంగాణాలో నిర్ణయించే మీటింగ్ ఇది. ఇక సంధ్య థియేటర్ ఘటనను బేస్ చేసుకునే ఈ మీటింగ్ జరగడంతో… ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నారు చిరంజీవి. అల్లు అర్జున్ ప్రస్తావన వస్తే మాట్లాడాల్సి వస్తుందని భావించిన చిరంజీవి… అల్లు అర్జున్ చేసిన దానికి తాను క్షమాపణలు అడగాల్సి వస్తుంది కాబట్టి సమావేశానికి వ్యూహాత్మకంగా దూరంగా ఉన్నారు చిరంజీవి. అలాగే బిజేపి నుంచి రాజ్యసభ సీటు కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.

Also read : టార్గెట్ మహిళా ఎమ్మెల్యే.. కార్పోరేటర్లకు జగన్ ఆదేశాలు

రాష్ట్రపతి వద్ద ఖాళీగా నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి చిరంజీవికి అని టాక్ ఉంది. ఈ టైం లో అనవసరంగా రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి నవ్వుతూ ఫోటోలు దిగితే బిజేపి పెద్దలు వాటిని సీరియస్ గా చూసే అవకాశం ఉండవచ్చు. అది అంచనా వేసుకున్న చిరంజీవి దూరంగా ఉండిపోయారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా తన నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గే ఛాన్స్ లేదు కాబట్టి అనవసరంగా దండం పెట్టి బ్రతిమిలాడటం ఎందుకని సైడ్ అయిపోయారు చిరంజీవి. అటు నందమూరి బాలకృష్ణ కూడా సమావేశానికి హాజరు కాలేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్