కడప జిల్లాలో నే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వినపడుతున్న ప్రముఖ మహిళా ఎమ్మెల్యే పేరు రెడ్డప్ప గారి మాధవి. కడప ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత ఆమె దూకుడు చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే వైసిపి నాయకులు ఖచ్చితంగా కడపలో వైసీపీకి భవిష్యత్తు లేకుండా చేస్తారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇదే టైంలో వైసిపిని ఎదుర్కోవడానికి ఆమె అన్ని విధాలుగా కష్టపడుతున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో అలాగే కడప మున్సిపాలిటీ పరిధిలో ఎన్నో సమస్యలు ఉండటంతో మాధవి రెడ్డి ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా పర్యటనలు చేస్తున్నారు.
Also Read : ఏపీలో మరో అధికారిపై ఏసీబీ కేసు నమోదు..!
అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ఆమె వెనకడుగు వేయటం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే కడప నియోజకవర్గంలో ఉన్న సమస్యల విషయంలో పలు నివేదికలు కూడా ఇచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కడప నియోజకవర్గానికి వెళ్లిన సందర్భంగా కూడా ఆయనకు పలు వినతి పత్రాలు కూడా ఆమె సమర్పించారు. అయితే తాజాగా వైయస్ జగన్ ఇడుపులపాయ పర్యటన సందర్భంగా కడప కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. రెడ్డప్ప గారి మాధవిని ఏ విధంగా ఎదుర్కోవాలి ఏంటి అనేదానిపై వారికి సూచనలు సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కొంతమంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్న నేపథ్యంలో వారికి భవిష్యత్తుపై కూడా భరోసా ఇచ్చి ఎమ్మెల్యేని ఏ విధంగా ఎదుర్కోవాలి… నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఏ విధంగా హైలైట్ చేయాలి.. అలాగే ఆమె ప్రసంగాలకు ఏ విధంగా సమాధానాలు చెప్పాలి అనేదానిపై పలు సూచనలు సలహాలు ఇచ్చారట వైఎస్ జగన్. ఇదే సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తో కలిసి కార్పొరేటర్లు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడితే అవినాష్ రెడ్డి మీకు అండగా ఉంటాడని హామీ ఇచ్చారట.
Also Read : ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ఖరారైతే తిరుగులేదు
అవినాష్ రెడ్డి అండగా ఉంటే తాను అండగా ఉన్నట్టే అనే అంశాన్ని జగన్ కార్పొరేటర్లకు స్పష్టంగా చెప్పారట. మాధవి రెడ్డి సోషల్ మీడియాలో వైసీపీని బ్రష్టు పట్టించే విధంగా ప్రసంగాలు ఇస్తున్నారని… కాబట్టి వాటికి కౌంటర్లు ఇచ్చే విధంగా ప్రణాళికల సిద్ధం చేసుకోవాలని గత ఆరు నెలల కాలంలో కడప నియోజకవర్గంలో ప్రభుత్వం ఏం చేసిందో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రణాళికల సిద్ధం చేసుకుని అడుగులు వేయాలని జగన్ సూచించారట.




