పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో బిజీగా ఉన్నా సరే సినిమాల విషయంలో మాత్రం పక్కా… ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు. 5 ఏళ్ల నుంచి మూడు సినిమాలను పవన్ కళ్యాణ్ షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. వచ్చే ఏడాది మార్చిలో ఒక సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ మూడు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
దీనికి సంబంధించి ఒక కథ కూడా త్రివిక్రమ్ రెడీ చేసుకున్నాడు. అయితే అల్లు అర్జున్ తో సినిమా తర్వాత ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఇక తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కూడా ఒక సినిమా చేయనున్నాడు పవన్ కళ్యాణ్. జవాన్ సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేసేలా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్.
Also Read : నేను సీఎం గా ఉండగా మీ ఆటలు సాగవు.. టాలీవుడ్ కు రేవంత్ స్ట్రోక్
అట్లీకి నేషనల్ లెవెల్ లో జవాన్ సినిమాతో ఇమేజ్ రావటంతో పవన్ కళ్యాణ్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే హైదరాబాదులో అట్లీ ఒక పవర్ఫుల్ కథను కూడా పవన్ కళ్యాణ్ కు చెప్పాడు. దానయ్య ప్రొడ్యూసర్ గా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించనున్నారు. అయితే ఇది ఎప్పుడు మొదలు పెడతారు అనేదానిపై ఫిబ్రవరిలో ఎనౌన్స్మెంట్ రానుంది. అయితే ఈ సినిమాను ఆరు నెలల్లో కంప్లీట్ చేసేలా అట్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.