Friday, September 12, 2025 09:24 PM
Friday, September 12, 2025 09:24 PM
roots

రేషన్ బియ్యంలో కీలకంగా కంప్యూటర్.. పేర్ని ఫ్యామిలీ అక్కడే దొరికిపోయిందా..?

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటీషన్ పై ఉత్కంఠ నెలకొంది. నేడు 9వ అదనపు జిల్లా కోర్టులో బెయిల్ పిటీషన్ పై విచారణ జరుగుతోంది. సివిల్ సప్లయిస్ కు అద్దెకు ఇచ్చిన గోడౌన్ లో 240 టన్నుల PDS బియ్యాన్ని పక్కదారి పట్టించారని జయసుధపై క్రిమినల్ కేసు నమోదు చేసిన అధికారులు… ఆ దిశగా విచారణ ముమ్మరం చేసారు. ఈ నెల 13న జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు జయసుధ. ఇప్పటి వరకు రెండుసార్లు వాయిదా పడిన బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది.

నేడు ప్రాసిక్యూషన్ తరపున కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున ప్రత్యేక పీపీగా విజయ అనే న్యాయవాదిని ప్రభుత్వం నియమించింది. మరోపక్క రేషన్ బియ్యం మాయంపై లోతుగా శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. గోడౌన్ లోని మిగులు నిల్వలను మార్కెట్ యార్డ్ కు తరలించిన అధికారులు… కీలక ఆధారాలు సేకరించారు. ప్రాథమికంగా 243 టన్నుల PDS రైస్ మాయమైనట్టు గుర్తించారు. గోడౌన్ లోని రికార్డులు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటి ఆధారంగానే కీలక సాక్ష్యాలు సేకరించారు.

Also Read : టీడీపీలో జోగి మంటలు.. ఇప్పట్లో చల్లారేనా..?

రికార్డులు, కంప్యూటర్లను నిశితంగా పరిశీలిస్తున్న అధికారులు… కంప్యూటర్లో బియ్యం లెక్కలను మార్చినట్టు గుర్తించారు. గౌడాన్ లో ఉండే ఒక కంప్యూటర్ లో… నిల్వలపై తప్పుడు సమాచారాన్ని నమోదు చేసారు. కాని ప్రభుత్వ లెక్కలకు ఆ కంప్యూటర్లో ఉన్న లెక్కలకు మ్యాచ్ కాలేదని అధికారులు భావించారు. ముందు గుడౌన్లో 3708 బస్తాల రేషన్ బియ్యం అంటే 185 టన్నులు మాయం అయ్యాయి అని భావించారు. కాని కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాతనే అసలు విషయం బయటకు వచ్చింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్