తెలంగాణ ప్రభుత్వంతో సినిమా పరిశ్రమ వివాదం ఇప్పట్లో ముగిసే అవకాశం లేనట్లు కనపడుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో సినిమా పరిశ్రమ పెద్దలు పంతానికి పోవడమే కొంప ముంచుతుంది అనే అభిప్రాయం వినపడుతోంది. రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసి… ఆయనను అసలు ముఖ్యమంత్రిగానే లెక్కచేయడం లేదు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అయింది. దీనికి తోడు సంధ్య థియేటర్ ఘటన విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ పదేపదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినిమా వాళ్ళను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా ఇక్కడ సమస్యకు మరింత ఇబ్బందికరంగా మారింది.
Also Read : కొనకళ్ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు…!
అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తో సినిమా పరిశ్రమలు పెద్దలు రాజీకి వెళ్ళడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంతేగాని రేవంత్ రెడ్డిని కోర్టు కేసులతో ఇబ్బంది పెట్టాలి అనుకుంటే రేవంత్ కూడా ప్రభుత్వానికి ఉన్న అధికారాలతో కచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అని అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు కేసు పెడితే ఆ విషయంలో రేవంత్ రెడ్డితో రాజీకి వెళ్లే ప్రయత్నం గాని లేదంటే పెద్దలు ముఖ్యమంత్రితో కానీ ప్రభుత్వ పెద్దలతో గాని మాట్లాడే ప్రయత్నం కానీ చేయకపోవడం సమస్యను తీవ్రతరం చేసింది.
Also Read : క్రికెట్ కు సైంటిస్ట్ గుడ్ బై… మిస్ యూ అశ్విన్
అదే సమయంలో నేరుగా హైకోర్టుకు వెళ్లి తనపై పెట్టిన కేసులు కొట్టేయాలంటూ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేయడంతో రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని పర్సనల్ గా తీసుకున్నారు అని అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అందుకే రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో విచారణ జరగకకు ముందు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు అని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా కొంతమంది నోటి దూల తగ్గించుకోకపోతే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈ విషయంలో సినిమా పరిశ్రమంలో అల్లు అర్జున్ కు మద్దతు ఇచ్చిన తప్పులేదు గాని అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రం చేయకుండా ఉండాలి అంటూ పలువురు సూచిస్తున్నారు. అనవసరంగా కేటీఆర్ మాటలు విని సినిమా పరిశ్రమ కోర్టుల చుట్టూ తిరిగితే రేవంత్ కూడా ఏం చేయాలో అది చేసి చూపిస్తారు అంటూ హెచ్చరిస్తున్నారు.




