Friday, September 12, 2025 09:05 PM
Friday, September 12, 2025 09:05 PM
roots

ఆ మాజీకి చెక్ పెట్టనున్న చంద్రబాబు…!

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతల కాలం చెల్లిందనే చెప్పాలి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు పార్టీలో చక్రం తిప్పిన సీనియర్లను కాదని పూర్తిగా కొత్త వారికే మంత్రి పదవులిచ్చారు చంద్రబాబు. దీంతో ఒకరిద్దరు సీనియర్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే కొందరు సీనియర్ల కుటుంబసభ్యులకు మాత్రం టికెట్లు ఇవ్వడంతో… వారంతా సైలెంట్‌గా ఉన్నారు. అలాంటి వారిలో యనమల రామకృష్ణుడు ఒకరు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇక 1995 సంక్షోభం సమయంలో కూడా చంద్రబాబు వెంటే ఉన్నారు. అందుకే ఆయనకు సముచిత స్థానం ఇచ్చారు చంద్రబాబు. స్పీకర్‌గా, ఆర్థిక శాఖ మంత్రిగా, పొలిట్‌బ్యూరో సభ్యునిగా అవకాశం ఇచ్చారు. 2004 నుంచి వరుసగా ఓడుతున్నప్పటికీ… ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి.. చట్టసభలో కొనసాగేలా చేశారు.

Also Read : వన్ నేషన్ వన్ ఎలక్షన్ షురూ… ఒక్క అడుగు అంతే

అయితే 2024 ఎన్నికల్లో యనమల కుమార్తెకు, అల్లుడికి, వియ్యంకుడికి టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. యనమల దివ్య తుని ఎమ్మెల్యేగా, పుట్టా మహేశ్ యాదవ్ ఏలూరు ఎంపీగా, పుట్టా సుధాకర్ యాదవ్‌ మైదుకూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యనమల దివ్యకు ప్రభుత్వ విప్ పదవి కూడా ఇచ్చారు చంద్రబాబు. అలాగే రామకృష్ణుడు ఇప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కూడా. దీంతో ఆయనకు ప్రస్తుతం ఏ పదవి ఇవ్వలేదు. అయితే ఇటీవల యనమల రామకృష్ణుడు పార్టీ అధినేత చంద్రబాబుకు రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతోంది. రాజ్యసభ సభ్యత్వం వస్తుందని ఆశించిన యనమల… కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో కినుక వహించారు యనమల. అందుకే బీసీలకు అన్యాయం అంటూ బహిరంగ లేఖ రాశారు.

Also Read : ఆ ఇద్దరికీ చంద్రబాబు ఇచ్చే పదవులేంటి…?

ఈ లేఖ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. యనమల లేఖ వెనుక పెద్ద రాజకీయమే ఉందనే మాట బలంగా వినిపిస్తోంది. దీంతో యనమలకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు మెగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. యనమల రామకృష్ణుడుని త్వరలో గవర్నర్‌ పదవి ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లు పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇలా ఇవ్వడం వల్ల బీసీ నేతకు గవర్నర్ పదవి ఇచ్చినట్లు అవుతుంది. అలాగే యనమల నోటికి రాజకీయ తాళం వేసినట్లు కూడా అవుతుందనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్