Tuesday, October 28, 2025 01:39 AM
Tuesday, October 28, 2025 01:39 AM
roots

ఆ ఇద్దరికీ చంద్రబాబు ఇచ్చే పదవులేంటి…?

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానాలకు అలాగే ఎమ్మెల్సీ పదవులకు దాదాపుగా ఒక స్పష్టత వచ్చేసింది. ఎమ్మెల్సీ పదవులు విషయంలో పలువురు నేతల పేర్లు వినపడుతున్నాయి. అలాగే రాజ్యసభకు ముగ్గురు ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి స్థానం విషయంలో కూడా స్పష్టత వచ్చేసింది. అయితే ఇప్పుడు ఓ ఇద్దరు నేతలకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా న్యాయం చేస్తారనే దానిపైన కాస్త సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అలాగే గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ విషయంలో చంద్రబాబు నాయుడు ఆలోచన ఏ విధంగా ఉందనే దానిపై స్పష్టత రావటం లేదు.

Also Read: ప్రభుత్వానికి కొత్త చిక్కుగా సరస్వతి వ్యవహారం…!

గల్లా జయదేవ్ 2014, 2019లో వరుసగా ఎంపీగా విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఆయన దూరంగా ఉన్నారు. అయినా సరే తెలుగుదేశం పార్టీకి మాత్రం దూరంగా లేరు. దీనితో ఆయనకు ఏదైనా కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కాస్త పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. గల్లా జయదేవ్ ను ముందు రాజ్యసభకు పంపించాలని భావించినా కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అయితే ఇప్పుడు ఆయనను ఎలాగైనా ప్రభుత్వంలోకి తీసుకోవాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారట.

Also Read: వేరే నాయకులు లేరా…? నాగబాబుకే ఎందుకు…?

గల్లా జయదేవ్ ని ప్రభుత్వంలోకి తీసుకుంటే ఖచ్చితంగా అది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక రంగానికి గల్లా జయదేవ్ ఖచ్చితంగా ఉపయోగపడతాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారు. అందుకే ఇప్పుడు గల్లా జయదేవును ఎలాగైనా ప్రభుత్వంలోకి తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు కాస్త వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఇదే పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన అనుభవం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కీలకంగా కానుంది.

Also Read: సిఆర్డీఏ కమీషనర్ వర్సెస్ నారాయణ… చంద్రబాబు కీలక నిర్ణయం

అందుకే ఆయనను రాజ్యసభకు పంపకుండా ఆపారని అంటున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ప్రభుత్వంలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని అందుకే ఆయన రాజ్యసభ సీటు విషయంలో కూడా బిజెపిపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురాలేదని ప్రచారం జరుగుతుంది. రెండు నెలల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన సందర్భంగా కూడా తన మనసులో మాట బయటపెట్టారని అంటున్నారు. ఇదే సమయంలో ఆయనను రాష్ట్రపతి ద్వారా నామినేట్ చేసే నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం నుంచి రాజ్యసభకు పంపించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యసభకు వెళ్లినా అదీ రాష్ట్రానికి లాభమే అనే భావనలో చంద్రబాబు నాయుడు ఉన్నారట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్