Tuesday, October 28, 2025 01:36 AM
Tuesday, October 28, 2025 01:36 AM
roots

ప్రభుత్వానికి కొత్త చిక్కుగా సరస్వతి వ్యవహారం…!

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి సరస్వతి పవర్ కంపెనీ భూముల వ్యవహారం సంచలనమైంది. ఇటీవల ఆ భూముల వద్దకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటన చేసింది. గతంలో సరస్వతీ పవర్ కంపెనీ భూములకు సంబంధించిన భూములలో ప్రభుత్వ భూమి కూడా ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం… ఈ మేరకు అధికారులపై సీరియస్ అయింది. సరస్వతీ భూములకు సంబంధించి అటవీశాఖతో పాటు రెవిన్యూ శాఖ అధికారులు సర్వే నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

Also Read: సిఆర్డీఏ కమీషనర్ వర్సెస్ నారాయణ… చంద్రబాబు కీలక నిర్ణయం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సర్వే నిర్వహించారు అధికారులు. సర్వే సందర్భంగా పలువురి రైతులతో కూడా అధికారులు మాట్లాడారు. 20 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యక్రాంతమైనట్టు గుర్తించారు. ప్రభుత్వ భూములతో పాటు అటవీ శాఖ భూములకు సంబంధించిన వాటిని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలతో అసైన్డ్ భూములకు సంబంధించిన యజమానులకు నోటీసులు పంపించారు. 15 రోజులలో నోటీస్ కి రిప్లై ఇవ్వాలని నోటీసులు పంపించారు అధికారులు.

Also Read: వేరే నాయకులు లేరా…? నాగబాబుకే ఎందుకు…?

అసైన్డ్ భూములకు సంబంధించి సరైనటువంటి వివరణ ఇవ్వనటువంటి యజమానుల నుంచి తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే భూములను స్వాధీనం పరుచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో చర్యలు చేపట్టారు. మొత్తం 17 ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ భూములను తిరిగి తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అసైన్డ్ భూములను వేరే వారికి బదలాయించే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ భూమిని దుర్వినియోగపరిస్తే వెనక్కి తీసుకున్న అవకాశం ఉన్న నేపథ్యంలో లబ్ధిదారుల నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న భూముల్లో రైతుల భూములు ఉండటంతో తిరిగి ఇవ్వడం సాధ్యం కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్