Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

ఆ నియోజకవర్గంలో వైసీపీ జెండా మోసే నాథుడే కరువు…!

వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందనేది అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో పాటు పార్టీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట కూడా. ఎన్నికల్లో మనదే గెలుపు అని ధీమాగా చెబుతున్నారు. అయితే 12 ఏళ్లు పార్టీకి అండగా ఉన్న నియోజకవర్గంలో లీడర్ కాదు కదా… కనీసం జెండా మోసే కార్యకర్త కూడా లేకుండా పోతే.. కనీసం పట్టించుకోవటం లేదు. కొడాలి నాని అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కృష్ణా జిల్లా గుడివాడ. 2004 నుంచి గుడివాడ అంటే కొడాలి నాని అనే పేరు తెచ్చుకున్నాడు. వరుసగా ఐదు సార్లు గెలిచిన నాని… ఒకదశలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ కలిసి వచ్చినా… నన్ను ఓడించలేరు అంటూ గొప్పగా చెప్పుకున్నాడు. అయితే 2024 ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఎంతలా అంటే… ఎవడొచ్చినా నాదే గెలుపు అనుకున్న నాని… చివరికి ఎన్నికల కౌంటింగ్‌లో తొలి రౌండ్ ఫలితం వెలువడిన వెంటనే… కేంద్రం నుంచి సైలెంట్‌గా సైడ్ అయ్యిపోయేంత.

Also Read : గులాబీ అరెస్ట్ వ్యూహం.. రేవంత్ ఉచ్చులో పడుతున్నారా..?

ఇక ఎన్నికలు ముగిశాయి… ఆరు నెలలు గడిచింది. గుడివాడలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే పనులు మొదలయ్యాయి. ఇదే సమయంలో గత పదేళ్లుగా వైసీపీ హయాంలో రెచ్చిపోయిన గడ్డం గ్యాంగ్‌ను కూటమి ప్రభుత్వం ఇప్పుడు టార్గెట్ చేసింది. నోటికి వచ్చినట్లు వాగిన వాళ్లను, దాడులు చేసిన వాళ్లను, అక్రమాలు, సెటిల్‌మెంట్‌, భూ దందాలు చేసిన వాళ్లను పోలీసులు వెతికిమరి పట్టుకుని నార తీస్తున్నారు. దీంతో నాని అనుచరులు అంతా అస్సాం పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే… గుడివాడలో ప్రస్తుతం వైసీపీకి కార్యాలయం కూడా లేకుండా పోయింది. పదవిలో ఉన్నంత కాలం ఎన్‌ఆర్ఐలకు చెందిన పాత శరత్ థియేటర్‌ను ఆక్రమించి తన పార్టీ కార్యాలయం కింద ఉపయోగించుకున్న కొడాలి నాని… ఫలితాల తర్వాత గుడివాడలో కనిపించటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడు ఫలితం అనుభవించాల్సి వస్తుందనే భయంతో హైదరాబాద్, బెంగళూరు వెళ్లిపోయాడనేది నాని ఫ్యాన్స్ మాట.

Also Read : జైస్వాల్ యాటిట్యూడ్ మార్చుకో… సీనియర్లు ఫైర్

గుడివాడలో పదేళ్ల తర్వాత తెలుగుదేశం జెండా ఎగరడంతో శరత్ థియేటర్‌ను అసలు యజమానులు సొంతం చేసుకున్నారు. దానిని ఇప్పుడు టీడీపీ కార్యాలయానికి అద్దెకు ఇచ్చారు. ఇక ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన కార్యాలయానికి కూడా అద్దె చెల్లించకపోవడంతో… దానిని కూడా తొలగించారు. దీంతో ఇప్పుడు గుడివాడలో పార్టీకి ఆఫీసు కూడా లేకుండా పోయింది. ఇక నానితో పాటు తిరిగిన అనుచరులంతా ఇప్పుడు ఏమయ్యారో కూడా తెలియటం లేదు. దీంతో గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ జెండా మోసే కార్యకర్త కూడా కనిపించటం లేదు. నిన్నటి వరకు గుడివాడ మా అడ్డా అని గొప్పలు చెపుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు… ఇప్పుడు కనీసం పార్టీ జెండా కూడా కనిపించకపోవడంతో… తలెత్తుకోలేని పరిస్థితికి చేరుకున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్