Friday, September 12, 2025 08:57 PM
Friday, September 12, 2025 08:57 PM
roots

జైస్వాల్ యాటిట్యూడ్ మార్చుకో… సీనియర్లు ఫైర్

అంతర్జాతీయ క్రికెట్ లో రాణించడం అంటే ఐపిఎల్ లో నాలుగు సిక్సులు కొట్టి అవుట్ అయినంత ఈజీగా ఉండదు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ ఆడాలంటే విశ్వాసం ఉండాలి గాని.. అది ఓవర్ కావొద్దు. ఈ విషయాన్ని ముందు యువ ఓపెనర్ జైస్వాల్ తెలుసుకుంటే చాలా మంచిది అంటున్నారు మాజీ ఆటగాళ్ళు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్ట్ లో ఈ కుర్రాడు దుమ్ము రేపాడు. అంత వరకు బాగానే ఉంది గాని, అది అతి అయింది. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ స్టార్క్ ను కెలికాడు జైస్వాల్. రెండో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో స్టార్క్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు.

స్టార్క్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అతనితో స్లెడ్జింగ్ చేయడానికి సీనియర్ ఆటగాళ్ళు కూడా ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు. కానీ జైస్వాల్ మాత్రం ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాళ్ళతో మాటల యుద్దానికి దిగాడు. స్టార్క్ ఆ కోపాన్ని తన బౌలింగ్ ప్రదర్శనలో చూపించి తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ లు తీసాడు. ఈ ఏడాది జైస్వాల్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు. ఆస్ట్రేలియా పర్యటన అతనికి అత్యంత కీలకం. కాబట్టి రాణించాల్సిన అవసరం ఉంది. తన పని తాను స్లోగా చేసుకుంటూ పోతే రివేంజ్ కు బలి కాకుండా ఉంటాడు.

Also Read: హేయ్… మీ ఆట తీరు మారదా..‌!

ఆస్ట్రేలియాతో మాటల యుద్దానికి దిగితే వాళ్ళు తమ ప్రదర్శనలో అది ఎక్కువగా చూపించి రివెంజ్ తీర్చుకుంటారు. కాబటి జైస్వాల్ అనవసరమైన వివాదాలకు పోకుండా ఆటపై దృష్టి సారించాలి. తన ఫుట్ వర్క్ లో మార్పులు చేసుకోవాలి. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆస్ట్రేలియా పర్యటనతోనే గిల్, పంత్… జట్టులో తమ ప్లేస్ ను పదిలం చేసుకున్నారు. ఇప్పుడు జైస్వాల్ ముందు మంచి అవకాశం ఉంది. స్లెడ్జింగ్ చేయడానికి చాలా టైం ఉంది. యువ ఆటగాడు, తొలి పర్యటన కాబట్టి జాగ్రత్తగా ఆడితే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు మాజీ ఆటగాళ్ళు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్