Friday, September 12, 2025 08:52 PM
Friday, September 12, 2025 08:52 PM
roots

అల్లు అర్జున్ కు వైసీపీ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసింది

గత ఆరు నెలల నుంచి అల్లు అర్జున్ కు ఓ రేంజ్ లో సపోర్ట్ చేస్తున్న వైసిపి ఇప్పుడు అతనికి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. వైసిపికి సపోర్ట్ చేసే వాళ్లకు మినిమం క్వాలిఫికేషన్ లు కొన్ని ఉండాలి అంటూ సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ క్వాలిఫికేషన్ లో ఒకటి అల్లు అర్జున్ సాధించాడంటూ టిడిపి అలాగే జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ అతని తరుపున నంద్యాల వెళ్లి ప్రచారం కూడా చేశారు.

Also Read : ఫస్ట్ డే పుష్ప 2 రికార్డుల జాతర

ఇక అక్కడి నుంచి అతనిపై టిడిపి, జనసేన అలాగే బిజెపి కార్యకర్తలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ అభిమానులైతే అల్లు అర్జున్ పేరు వింటే చాలు మండిపడుతున్నారు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా వివాదాల్లో నడుస్తోంది. ఈ సినిమాకు ఏం జరిగినా సరే వివాదంగానే ఉంది. ఇటీవల ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య70 70 ఎంఎంకు అల్లు అర్జున్ పుష్ప ప్రీమియర్ షో కి వెళ్ళాడు. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే మరో చిన్నారి కిమ్స్ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు ఓ కేసు నమోదు చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన కేసులో అల్లు అర్జున్ తో పాటుగా పుష్ప సినిమా నిర్మాతలు కూడా ఉన్నారు. పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు కూడా వచ్చారు. దీనితో పోలీసులు కూడా భద్రత కల్పించలేక చేతులెత్తేసారు. ఇక ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయడం పట్ల ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక కామెంట్లు వస్తున్నాయి.

Also Read : ఐకాన్ స్టార్ ను పొలిటికల్ స్టార్ ను చేసారా… వైసీపీ మెగా ప్లాన్

వైసీపీకి సపోర్ట్ చేశాడు కాబట్టి ఆ పార్టీ మినిమం క్వాలిఫికేషన్ అయిన కనీసం ఒక్క కేసు అయినా నమోదు కావాల్సి ఉంటుందని… ఇప్పుడు ఆ క్వాలిఫికేషన్ అల్లు అర్జున్ సంపాదించాడని భవిష్యత్తులో అతను మరిన్ని కేసులు ఎదుర్కొంటాడని… వైసీపీతో జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. పుష్ప సినిమా సక్సెస్ అయినా సరే ఇప్పుడు అల్లు అర్జున్ అండ్ పుష్పా టీం ఏమాత్రం సంతోషంగా లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్