ఆంధ్రప్రదేశ్ లో విమానయాన రంగం ఊపు అందుకుంటుంది. ఇప్పటి వరకు విమానాశ్రయాలను నిర్లక్ష్యం చేసినా ఇప్పుడు మాత్రం అంతర్జాతీయ విమానాలకు మార్గం సుగుమం చేస్తున్నారు. అభివృద్ధిలో విమానయాన రంగం పాత్ర కీలకం కావడంతో అటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోంది. ఇప్పటి వరకు కనేక్టేడ్ ఫ్లైట్స్ నడిచే విమానాశ్రయాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ ను అందుబాటులోకి తీసుకురావడం, కొన్ని విమానాశ్రయాలకు అంతర్జాతీయ డైరెక్ట్ ఫ్లైట్స్ తీసుకురావడం మొదలయింది. కీలకమైన విమానాశ్రయాలను మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
Also Read: వివేకా కేసు తేలేనా… పోలీసులతో ఆడుకుంటున్న అవినాష్ అండ్ గ్యాంగ్
రాయలసీమలో కీలకమైన రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానం ప్రారంభం అయింది. విమానాశ్రయం నుంచి సింగపూర్ కు డైరెక్ట్ ఫ్లైట్ ను ప్రారంభించారు. ఉదయం 5 గంటలకు తొలి ఇంటర్నేషనల్ ఫ్లైట్ బయల్దేరింది. ఎంఎస్ లక్స్ ఏవియేషన్ సాన్ మారినో ప్రవేట్ సంస్థకు చెందిన విమానం ఈ రోజు నుంచి తన సేవలను మొదలుపెట్టింది. ఈ మధ్యనే బెహరిన్ నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్ కు ప్రైవేట్ జెట్ వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఆదేశాలతో అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలకే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేసారు.
Also Read: వివేకా కేసు తేలేనా… పోలీసులతో ఆడుకుంటున్న అవినాష్ అండ్ గ్యాంగ్
సింగపూర్ కు విమాన సర్వీసును ప్రారంభిస్తే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా. థాయ్లాండ్ సహా అనేక దేశాలకు ప్రయాణం సులభతరం కానుంది. ఈ మేరకు సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చామని ప్రకటించారు. ఇటీవల రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం నుంచి కూడా ఢిల్లీ, ముంబైలకు డైరెక్ట్ ఫ్లైట్స్ వేసారు. ఇప్పటి వరకు మధురపూడి నుంచి బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి, గన్నవరం సహా కొన్ని ప్రాంతాలకు మాత్రమే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేవి. త్వరలోనే కర్నూలు విమానాశ్రయం నుంచి కూడా కొన్ని విమానాలు డైరెక్ట్ సేవలను ప్రారంభించనున్నాయి.