Friday, September 12, 2025 08:52 PM
Friday, September 12, 2025 08:52 PM
roots

నోర్ముయ్.. ప్రెస్‌మీట్‌లోనే అజిత్ పవార్‌పై ఏక్‌నాథ్ షిండే ఫైర్

మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు సవాల్ గా మారింది. ఎన్సీపీ బీజేపీ శివసేనలతో కూడిన ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని పది రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో మాజీ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఒక అంగీకారానికి రాకపోవడం అలాగే బీజేపీ తమకే ముఖ్యమంత్రి పదవి కావాలి అంటూ పట్టు పట్టడంతో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఈ విషయంలో అజిత్ పవార్ సైలెంట్ అయినా సరే షిండే మాత్రం తనకు ముఖ్యమంత్రి పదవి కావాల్సిందే అంటూ పట్టుపట్టారు.

Also Read : నా భార్య ఫోన్ కాల్స్ రికార్డ్ చేశాడు.. హరీష్ రావు పై యువకుడి సంచలన ఆరోపణలు

మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళిన షిండే, అజిత్ పవర్ అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి విషయంలో ఒక అంగీకారానికి వచ్చారు. బిజెపి పెద్దలతో జరిగిన సమావేశంలో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి అంగీకారమే అని షిండే అంగీకరించారు. ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే అజిత్ పవర్ ఇద్దరూ ముంబై రాగా షిండే మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయారు. తన కుమారుడికి కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పించాలని ఆయన కోరినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే నేడు బిజెపి శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేవేందర్ ఫడ్నవీస్ ను బిజెపి ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇక ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే అని భావించిన తరుణంలో షిండే ఊహించని షాక్ ఇచ్చారు.

Also Read : మరో ఐపిఎస్ కు మూడింది

మూడు పార్టీల నేతలు కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో తన అసంతృప్తిని వెళ్ళగక్కారు ఏకనాథ్ షిండే. చివరి క్షణంలో షిండే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పోస్టుకు తాను సమ్మతం కాదని… ఏ సంగతి సాయంత్రం చెబుతానంటూ మరో ఝులక్ ఇచ్చారు. ప్రెస్ మీట్ లోనే విభేదాలు కనిపించడంతో దేవేంద్ర పడ్నవీస్ ఆయనను వెంటనే శాంతింప చేసే ప్రయత్నం చేశారు. ప్రెస్ మీట్ లోనే షిండేని ఫడ్నవీస్ అలాగే అజిత్ పవర్ ఇద్దరూ బతిమిలాడే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే జోక్యం చేసుకున్న షిండే, అజిత్ పవర్ పై ఫైరయ్యారు. నీలాగా పూటకు ఒక మాట మార్చను అంటూ అజిత్ పవార్ ను టార్గెట్గా చేసుకుని మాట్లాడారు. దీనితో మీడియా సమావేశానికి వచ్చిన మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. అసలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందే పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఏ విధమైన పరిణామాలు ఉండవచ్చు అంటూ కూటమిలో ఆందోళన మొదలైంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్