Saturday, September 13, 2025 01:31 AM
Saturday, September 13, 2025 01:31 AM
roots

రేషన్ బియ్యం తరలిస్తే ఇక అంతే సంగతులు.. ఏపి కొత్త చట్టం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేయడానికి సిద్దమైంది. బియ్యం అక్రమ రవాణా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఉండటంతో అధికారులు కూడా అలెర్ట్ అయ్యారు. ఇప్పటి వరకు చూసి చూడనట్టు వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం… పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత కఠిన చర్యలకు సిద్దమైంది. నేడు ఈ అంశంపై కేబినేట్ సబ్ కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయనున్నారు. అంటే దాదాపు మూడేళ్ళ పాటు బెయిల్ లేకుండా జైల్లో ఉండనున్నారు.

Also Read : ఆ నియోజకవర్గంలో ఆధిపత్య పోరుకి బాబు చెక్‌ పెడతారా…?

ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు కఠిన చట్టాలను రూపొందించాలని సబ్ కమిటీ సిఫారసు చేసింది. దీనికి ప్రభుత్వం కూడా వెంటనే ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం. పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్య కుమార్ యాదవ్ మరియు ఉన్నతాధికారులతో సమీక్ష జరిగింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టు వ్యవహారంపై చర్చించిన మంత్రులు పలు కీలక అంశాలపై నివేదికను సిద్దం చేసారు.

Also Read : ఏపి పోలీసులను వెక్కిరించిన వర్మ…

మంత్రుల సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాకినాడ పోర్టు భద్రత కోసం ఛీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ పోర్టులో భద్రత వ్యవస్థ బలోపేతం చేయాలని నిర్ణయించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ పోర్టు, పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపనున్నారు. కాకినాడ పోర్టుకు వెళ్లే లారీల నుంచి అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దమయ్యారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలకు నిర్ణయం తీసుకున్నారు మంత్రులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్