Saturday, September 13, 2025 03:23 AM
Saturday, September 13, 2025 03:23 AM
roots

దందాకు బొంద పెట్టేందుకు రెడీ

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బియ్యం అక్రమ దందా వ్యవహారం ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీని వెనక విదేశీ శక్తులు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే అంత పెద్ద మొత్తంలో అక్రమ రేషన్ బియ్యం దందా జరుగుతుంటే కాకినాడలో అధికారులు కూడా పెద్దగా చర్యలు తీసుకోలేకపోతున్నారని, కీలక అధికారులను రేషన్ బియ్యం మాఫియా లొంగదీసుకుంది అనే అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. గత ప్రభుత్వం రేషన్ బియ్యం సరఫరా వాహనాల ద్వారా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమాలకు పాల్పడిందని దాదాపు ఈ అక్రమాల ద్వారా 50వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం అర్జించినట్లుగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు.

Also Read : మెగా Vs అల్లు రచ్చ.. క్లారిటీ వచ్చేది నేడే..!

అసలు అక్రమ రేషన్ బియ్యం అంత పెద్ద మొత్తంలో వెళ్లడానికి కారణం ఏంటి అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీయడం మొదలు పెట్టింది. దీనికి తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హులు రేషన్ బియ్యం తీసుకోకపోవడమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొంతమంది తీసుకుని అక్రమ మార్గంలో అమ్ముకుంటున్నారనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీనితో ఇప్పుడు రేషన్ బియ్యం సరఫరా విషయంలో కీలక అడుగులు పడే అవకాశం కనబడుతోంది. గతంలో లావు బియ్యం సరఫరా చేయగా ఇప్పుడు సన్నబియాన్నే రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అయినా సరే అక్రమ రేషన్ బియ్యం దందా తీవ్ర స్థాయిలో జరుగుతుంది.

దీనితో ఇప్పుడు ఈ విషయంలో కఠిన అడుగులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయి ఈ అంశంపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేస్తున్నా రేషన్ బియ్యాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా తరలిస్తున్నారని సరిహద్దుల నుంచి పెద్ద ఎత్తున కాకినాడ తరలి వెళ్తుందని అక్కడి నుంచే విదేశాలకు తరలిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.

Also Read : మెగా Vs అల్లు రచ్చ.. క్లారిటీ వచ్చేది నేడే..!

దీనితో త్వరలోనే దీనిపై ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అక్రమ రేషన్ బియ్యం దందా జరిగే మార్గాల్లో భద్రతను పెంచాలని అలాగే నిఘా కోసం ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అక్రమ రేషన్ బియ్యం నిలువలపై కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్రమంగా నిల్వ చేసిన వారిపై పిడిఎఫ్ నమోదు చేసి కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. పోర్ట్ నిర్వహణ సంస్థ చిత్తశుద్ధి పై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పోర్టుని వారి నుంచి మరొక సంస్థకు అప్పగించాలన్న వాదన కూడా తెరమీదకు వచ్చింది. దీని పై కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్