Monday, October 27, 2025 10:40 PM
Monday, October 27, 2025 10:40 PM
roots

మెగా Vs అల్లు రచ్చ.. క్లారిటీ వచ్చేది నేడే..!

పుష్ప 2… ఇప్పుడు అటు సినీ ఇండస్ట్రీలో కాకుండా… ఇటు రాజకీయాల్లో కూడా కాకరేపుతున్న సినిమా. మెగా కుటుంబం నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. పుష్ప 1 సూపర్ హిట్‌ కావడంతో పాటు అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతోంది. వాస్తవానికి 2022 డిసెంబర్‌లోనే రావాల్సిన సినిమా రెండేళ్లు ఆలస్యంగా ఈ ఏడాది వస్తోంది. ఈ ఆలస్యమే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో నీలినీడలకు కారణమైంది. ఎన్నికల ముందు వరకు ఒక లెక్క… ఎన్నికల తర్వాత ఒక లెక్క అన్నట్లుగా మెగా ఫ్యామిలీ చీలిపోయింది. చివరికి ఈ విబేధాలు పుష్ప 2 సినిమాపై స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read : తిరుమల వెళ్ళే రాజకీయ నేతలకు హై అలర్ట్

మిత్రుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి కోసం అల్లు అర్జున్‌ నంద్యాల వెళ్లడమే ఈ విబేధాలకు కేంద్రబిందువైంది. ఓ వైపు మేనత్త మరిది పవన్‌ వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేసి పోరాటం చేస్తుంటే… బన్నీ ఇలా చేయడం ఎంత వరకు సమంజసం అనేదే హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో అప్పటి వరకు ఒకటిగా ఉన్న మెగా, బన్నీ ఫ్యాన్స్‌… ఇప్పుడు వేరయ్యారు. ఇదే సరైన అవకాశంగా భావించిన వైసీపీ నేతలు… అల్లు అర్జున్‌ సినిమాను సొంతం చేసుకున్నారు. మావాడు అంటూ అగ్నికి ఆజ్యం పోసేలా నాలుగు మాటలు నూరు పోశారు. దీంతో సినిమా వార్‌ కాస్తా.. పొలిటికల్‌ వార్‌గా మారిపోయింది.

ఈ నేపథ్యంలో పుష్ప 2 ప్రమోషన్ గ్రాండ్‌గా చేస్తున్నారు నిర్మాతలు. పాట్నా, చెన్నైలో భారీగా నిర్వహించిన ప్రొడ్యూసర్స్‌… ముంబైలో మాత్రం కూల్‌గా చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌పైనే అందరి దృష్టి పడింది. హైదరాబాద్‌లో జరగనున్న ఫంక్షన్‌కు చీఫ్‌ గెస్ట్‌ ఎవరు అనేది ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలతో పాటు, ఏపీ రాజకీయాల్లో కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. సినిమా రిలీజ్‌కు ముందే దాదాపు రూ.1,100 కోట్ల బిజినెస్ చేసిన సినిమాగా ఇప్పటికే పుష్ప రికార్డు సృష్టించింది. అలాగే పుష్ప 2 కోసం వెయిటింగ్‌ అంటూ సోషల్ మీడియాలో అన్ని వర్గాల ప్రజలు మెసేజ్‌లు పెడుతున్నారు.

Also Read : గిల్ సిద్ధం.. రాహుల్ ప్లేస్ ఫైనల్ అయినట్టే..?

వీటన్నిటికి తోడు అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చిన తర్వాత వస్తున్న సినిమా. కాబట్టి ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఇలాంటి సినిమాకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా చీఫ్‌ గెస్ట్‌గా వస్తారా… రారా అనేదే ఇప్పుడు సెంటర్‌ పాయింట్‌. చిరంజీవి, రామ్‌చరణ్‌, పవన్‌ కల్యాణ్‌ లలో తప్పకుండా ఒకరు వస్తారనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. అయితే అలా జరగదు అంటున్నారు బన్నీ ఫ్యాన్స్‌. పాట్నా, చెన్నై, ముంబై ఫంక్షన్‌లకు ఎవరూ రాలేదని… అలాగే హైదరాబాద్‌ వేడుకకు రారంటున్నారు. అయితే ఈ ఫంక్షన్‌కు మెగా కుటుంబం నుంచి ఒకరు వచ్చినా చాలు… వివాదాలు లేవనే క్లారిటీ వచ్చేస్తుంది అనేది సినీ విశ్లేషకుల మాట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్