ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు సిఎం చంద్రబాబుకు చికాకుగా మారాయి. తాజాగా అనంతపురం, కడప జిల్లాల్లో ఓ సమస్య చంద్రబాబుకు తల నొప్పిగా మారింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి… జేసి కుటుంబానికి వివాదం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఫ్లైయూష్ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం తీవ్ర స్థాయిలో ఉంది. లోడ్ చేయకుండా తన లారీలను అడ్డుకుంటున్నారు అని జేసి ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయి పోలీసులకు హెచ్చరిక లేఖలు కూడా రాసారు.
Also Read: జేసి ఫ్యామిలీని పోలీసులు ఇంకా వేధిస్తున్నారా…?
ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసారు. అదే విధంగా ఫ్లైయూష్ ను లోడ్ చేసే సమయంలో తమ లారీలను కావాలనే పక్కన పెడుతున్నారని… లోడ్ చేయకపోతే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. దీనితో నిన్నటి నుంచి కడప, అనంతపురం జిల్లాలో భద్రతను భారీగా పెంచారు. ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. ఇక ఈ సమస్యపై సిఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. ముఖ్యమంత్రి సీరియస్ అయినా పట్టించుకోని ఎమ్మెల్యేలు.. మూడో రోజు కూడా వారి వారి పంధాలోనే కొనసాగుతున్నారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
Also Read: పరారీలోనే కీలక కేసుల్లో నిందితులు.. కారణం..?
జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన 8 లారీలు నిన్నటి నుండి ఆర్ టి పి పి వద్దనే ఉన్నాయి. జెసి ప్రభాకర్ రెడ్డి ఆర్టిపిపికి వస్తానని ఎస్పీకి లేఖ రాయడంతో మూడో రోజు కూడా అప్రమత్తమైయ్యారు పోలీసులు. గత వారం రోజులుగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డి ల మధ్య ప్లయాష్ వార్ తీవ్ర స్థాయిలో నడుస్తోంది. తాడిపత్రిలోని ఎల్ అండ్ టి కంపెనీకి ఫ్లై యాష్ సరఫరాలో ఇద్దరు మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చాయి. ఉదయం 5 గంటల నుంచి ఆర్టీపిపి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు… ఎవరిని లోపలి అనుమతించడం లేదు. ఈ వివాదంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేలతో ఆయన స్వయంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. రేపు ఇద్దరు నాయకులని అమరావతి రమ్మని చెప్పినట్లు తెలుస్తుంది. మరి వీరి సమస్యలకి పరిష్కారం లభిస్తుందా లేదా అని చూడాలి.