ఒకప్పుడు నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమాలు అంటే కమర్షియల్ యాంగిల్ ఉండదు అనే ఫీల్ జనాల్లో ఉండేది. కానీ అఖండ సినిమా తర్వాతి నుంచి బాలయ్య కమర్షియల్ రూట్ లోకి వచ్చేశారు. తన వరుస సినిమాల్లతో బిజీగా ఉంటూనే కమర్షియల్ ప్లానింగ్ తో దుమ్ము రేపడానికి సిద్దమవుతున్నారు. అఖండ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి అంత గొప్పగా ఆడకపోయినా కమర్షియల్ గా మంచి హిట్ అనే చెప్పాలి. ఇక భగవంత కేసరి కూడా బాగానే ఆడింది.
Also Read : మోడరన్ డే హీరో… ది బెస్ట్ డిఫెన్స్ టెక్నిక్
ఆ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు డాకూ మహారాజ్ అనే సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమా విషయంలో కమర్షియల్ ప్లానింగ్ తో దిగుతున్నారు బాలయ్య. అమెరికాలో ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అమెరికాలో ప్రీ బుకింగ్ మార్కెట్ దేవర సినిమా తర్వాత ఎక్కువైంది. తెలుగు సినిమాలకు అక్కడ మంచి ఆదరణ వస్తోంది. అందుకే బాలకృష్ణ ఇప్పుడు అమెరికాలో ఈవెంట్ కు ప్లాన్ చేసారు. అన్ స్టాపబుల్ షో తర్వాత బాలయ్యకు అక్కడ మంచి ఫాలోయింగ్ పెరిగింది.
Also Read : మరో మాజీ ఎమ్మెల్యేకి ఎర్త్ పెట్టిన బాబు సర్కార్
అఖండ తర్వాత ఇతర భాషల్లో ఫాలోయింగ్ క్రియేట్ అయింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి బాలయ్య రెడీ అవుతున్నారు. డాకూ మహారాజ్ ఈవెంట్ ను అమెరికాలో గ్రాండ్ గా ప్లాన్ చేసారు బాలయ్య. టెక్సాస్ లో ఈ సినిమా ఈవెంట్ ను నిర్వహించడం ద్వారా కెనడా సహా యూరప్ లో కూడా బజ్ క్రియేట్ చేయాలని బాలయ్య స్కెచ్ గీసినట్టు టాలీవుడ్ జనాలు అంటున్నారు. యువ హీరోలతో సమానంగా బాలయ్య ఇప్పుడు కమర్షియల్ అడుగులు వేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.