భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైంది. ఈ ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా పిచ్ లపై పేస్ బౌలింగ్ అటాక్ కు ప్రాధాన్యత ఉన్న నేపధ్యంలో ఈ ఇద్దరికీ చోటు కల్పించారు. రంజీ ట్రోఫీ తో పాటుగా ఐపిఎల్, ఇతర దేశవాళి మ్యాచ్ లలో ఈ ఇద్దరూ మెరుగైన ప్రదర్శన చేసారు. హర్షిత్ రానా బౌలర్ గా తాను ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పటికే.
Also Read : టార్గెట్ పంత్.. ఆసీస్ బౌలర్ల వ్యూహం ఇదే..!
ఇక్కడ యువ, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి హాట్ టాపిక్ గా మారాడు. ఐపిఎల్ లో ఈ ఏడాది బ్యాటింగ్ లో అదరగొట్టాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టి20 సీరీస్ లో కూడా… నితీష్ మెరుగైన ప్రదర్శన చేసాడు. ఈ మీడియంపేసర్ తన కెరీర్‌లో 23 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడగా… 26.98 సగటుతో 56 వికెట్లు తీశాడు. అలాగే 21.05 సగటుతో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో 779 పరుగులు చేశాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఆంధ్రా తరపున ఆడినప్పటికీ, నితీష్ 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు.
Also Read : జైస్వాల్ ను టెంప్ట్ చేస్తే చాలా…?
ఈ టోర్నీలో అతను 142.92 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు చేసి మూడు వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో 34 బంతుల్లో 74 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసాడు. అలాగే రెండు వికెట్ లు కూడా తీసుకున్నాడు. దీనితో నితీష్ ను… హెడ్ కోచ్ గంభీర్ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయాలని పట్టుబట్టాడు. పేస్ ఆల్ రౌండర్ కావాల్సి ఉన్న నేపధ్యంలో అతనిని తుది జట్టులో ఎంపిక చేసారు. గత ఆస్ట్రేలియా పర్యటనలో తెలుగు రాష్ట్రాల నుంచి… హనుమ విహారి ప్రాతినిధ్యం వహించాడు. కాగా తొలి టెస్ట్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.