ఆస్ట్రేలియా పర్యటన అంటే అంత ఆషామాషీగా ఉండదు. ఇండియాలో చూపించే దూకుడు అక్కడ చూపిస్తే.. ఆసీస్ బౌలర్లు మడత మడత పెట్టేస్తారు అని చెప్పడంలో ఏ డౌట్ అక్కర్లేదు. ఫాస్ట్ బౌలర్లు వికెట్ ల కోసం వేటాడుతూ ఉంటాడు. నువ్వు ఎంత టాలెంట్ ఉన్న బ్యాట్స్ మెన్ అయినా వాళ్ళ ముందు ఆటలు చెల్లవు. ఒకరిని మించి ఒకరు బులెట్ వేగంతో బంతులు విసురుతూ ఉంటారు. ప్రతీ బంతి ఖచ్చితంగా స్టంప్స్ ను టార్గెట్ చేస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. వికెట్ కోసం అవసరమైతే పరుగులు కూడా ధారాళంగా ఇచ్చే వ్యూహంతో దిగుతారు ఆస్ట్రేలియా బౌలర్లు.
Also read : జగన్ సుద్దపూస కబుర్లు.. నవ్వుకుంటున్న ప్రజలు
మాటల యుద్దాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా సరే.. సీన్ రివర్స్ అవుతుంది. ఈ విషయాన్ని భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముందు గ్రహించాలి. ఆస్ట్రేలియా మీడియా ఈ కుర్ర బ్యాటర్ విషయంలో కావాలనే హైప్ ఇచ్చింది. టార్గెట్ చేయండి అంటూ తమ ఆటగాళ్లకు చెప్పేసింది. మనోడికి తొందర ఎక్కువ. దూకుడుగా బ్యాటింగ్ చేయాలనే స్వభావం. న్యూజిలాండ్ పర్యటనలో రివర్స్ స్వీప్ కోసం టెంప్ట్ అయి కీలక సమయంలో వికెట్ ఇచ్చేసాడు. మూడో టెస్ట్ లో అది బాగా ప్రభావం చూపింది.
Also read : దొంగ కార్ల దొంగతనం… ఐఏఎస్ అధికారి భార్య కక్కుర్తి
స్పిన్ లో బ్యాట్ తిప్పినట్టు పేస్ బౌలింగ్ లో తిప్పాలి అంటే అనుభవం ఉండాలి. పంత్ ఈ విషయంలో ఆరితేరిపోయాడు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ జైస్వాల్ కొత్త ఆటగాడు. ఓపెనర్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఉంటేనే ప్రత్యర్ధిని ఇబ్బంది పెట్టడం సాధ్యం అవుతుంది. జైస్వాల్ ఇది గ్రహించి బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ లో నిలకడ ఉన్నా… మంచి బంతులకు కూడా టెంప్ట్ అయిపోయి దూకుడుగా ఆడతాడు అనే విమర్శ అతనిపై ఉంది. కాబట్టి ఈ సీరీస్ లో అతను ఎంత పిచ్ ను అర్ధం చేసుకుని ఆడతాడు అనే దానిపై భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.