ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు కీలక అడుగులు వేస్తున్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆయన పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రజలకు దగ్గరగా లేరనే ఆరోపణలు అప్పుడప్పుడు వినిపించేవి. కానీ ఈసారి మాత్రం ఆ తరహా ఆరోపణలు రాకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయవాడ వరదల సమయంలో చంద్రబాబు వైఖరి చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఆ వయసులో కూడా ఆయన అలా కష్టపడటాన్ని చూసి పలువురు వ్యతిరేకులు కూడా ప్రసంశించారు.
Also Read : నార్త్ పైనే ఫోకస్… బాలీవుడ్ వెన్నులో వణుకు
ఇక ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకోవడానికి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞాన్ని వాడుకోవాలని ఆయన భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తరహాలో మాన్ కీ బాత్ ప్రోగ్రాం ను నిర్వహించేందుకు సిద్దమయ్యారు చంద్రబాబు. ఇది రేడియోలో ప్రసారం చేస్తారా లేదంటే టీవీలో ప్రసారం చేస్తారా… ఒటీటీ సంస్థలతో ఒప్పందం చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఫోన్ లోనే ఓ యాప్ కూడా ఈ మేరకు లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆహాలో నిర్వహించే అన్ స్తాపబుల్ కార్యక్రమం ప్రోగ్రాం డైరెక్టర్లు దీనికి రూపకల్పన చేయనున్నట్లు తెలుస్తుంది.
Also Read : ఆర్జీవీ… ఇంత పిరికోడా…!
త్వరలోనే దీనికి సంబంధించి వర్క్ కూడా స్టార్ట్ కానుంది. జనవరి నుంచి దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఏపీ ఫైబర్ నెట్ ను ముందు పూర్తి స్థాయిలో పునరుద్దరించి… అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని భావిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఇది ప్రారంభించే అవకాశం ఉంది. ముందు నారావారి పల్లె లేదా కుప్పం నియోజకవర్గంలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఇది ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నేరుగా అయిదుగురు మహిళలు, ఇద్దరు పురుషులతో మాట్లాడనున్నారు.