ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గతంలో అసెంబ్లీ సమావేశాలకు ఈ అసెంబ్లీ సమావేశాలకు సీనియర్ సభ్యులు వ్యత్యాసం గమనిస్తూ తమ సన్నిహితుల వద్ద కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ నుంచి గతంలో గెలిచి… ఇప్పుడు టీడీపీ నుంచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టిన ఓ మంత్రి, ఎమ్మెల్యే తమ సన్నిహితుల వద్ద తమ అనుభవాలను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తమకు ఏ విధమైన అనుభవాలు ఎదురయ్యాయి… ఇప్పుడు ఏ విధమైన వాతావరణం ఉందనేది స్పష్టంగా చెప్తున్నారు.
Also read : అసలు వీళ్లు సౌతాఫ్రికా క్రికెటర్లేనా…?
గతంలో గుమ్మనూరు జయరాం వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన మంత్రిగా కూడా పని చేసారు. కానీ సిఎం జగన్ వద్దకు ఏనాడు వెళ్లి… తన శాఖలో సమస్యలు గాని… లేదంటే కనీసం తన నియోజకవర్గ సమస్యలు గాని చెప్పుకుని వాటికి పరిష్కారం వెతుక్కున్న పరిస్థితి లేదు. ఈ విషయాన్ని అనంతపురం జిల్లాకు చెందిన తన సన్నిహిత ఎమ్మెల్యే వద్ద జయరాం ప్రస్తావించారు. తాను ఎప్పుడూ మంత్రిగా వ్యక్తిగతంగా జగన్ ను కలవలేదని… కనీసం తాడేపల్లిలోని జగన్ నివాసం వద్దకు గాని, అసెంబ్లీలోని జగన్ కార్యాలయం వద్దకు గాని వెళ్ళలేదు అని…
Also read : రెడ్ అలెర్ట్: అంతా కల్తీ మయం… టేస్ట్ లో వరస్ట్..!
ఏదైనా ఉంటే సజ్జల రామకృష్ణా రెడ్డి పిఏకు చెప్పడమే గాని సజ్జల కూడా ఏనాడు కలవలేదు అని చెప్పుకోచ్చారట. ఇప్పుడు మాత్రం సిఎంతో పాటుగా సీఎస్, ఇతర మంత్రులను స్వేచ్చగా కలుస్తున్నా అని తన అనుభవాలను చెప్పుకుంటున్నారు. మంత్రి పార్ధసారధి కూడా ఇంతే. తాను జగన్ కోసం జైలుకు వెళ్ళినా… ఏనాడు తనను వ్యక్తిగతంగా కలిసి తన సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించలేదు అని పల్నాడు జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యేకు తన అనుభవాలను చెప్పుకున్నారు. అసెంబ్లీ లాబీల్లో… మంత్రులు స్వేచ్చగా తిరగడం తనకు కొత్త అనుభవం అని… గతంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇంత స్వేచ్చ లేదని… కొందరు మంత్రులకు అసెంబ్లీకి రావొద్దు అని ఫోన్ లు చేసి చెప్పేవారు అని ఆయన గుర్తు చేసుకున్నారు.




