Saturday, September 13, 2025 07:10 AM
Saturday, September 13, 2025 07:10 AM
roots

డాకూ మహారాజ్ టార్గెట్ 350 కోట్లు.. టాలీవుడ్ లో కొత్త జోష్

టాలీవుడ్ కే పరిమితం అయిన గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ… అఖండ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టి తాను ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్నారు. వీర సింహారెడ్డి పాన్ ఇండియా లెవెల్ లో ఆడకపోయినా తర్వాత వచ్చిన భగవంత కేసరి మాత్రం సౌత్ లో బాగానే ఆడింది. ఇప్పుడు అఖండ సీక్వెల్ ను పాన్ ఇండియా లెవెల్ లో బాలయ్య ప్లాన్ చేసారు. దాని కంటే ముందు డాకూ మహారాజ్ తో బాక్సాఫీస్ పై యుద్దానికి దిగారు బాలయ్య. టీజర్ తో తాను భయంకర యుద్ధం చేయబోతున్నట్టు హింట్ ఇచ్చేసారు.

Also Read : ప్రభాస్ లైనప్ చూస్తే కళ్ళు తిరగాల్సిందే..!

ఈ సినిమా కోసం బాలయ్య దాదాపు రెండేళ్ళ నుంచి కష్టపడుతున్నారు. సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను రిలీజ్ చేస్తున్న మేకర్స్… ఇప్పుడు సినిమాను ఏ రేంజ్ లో ప్రమోట్ చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ సినిమాకు బాలయ్యే దాదాపు అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పినట్టు టాక్. ఇక డాకూ మహారాజ్ తో కొత్త టార్గెట్ ఫిక్స్ చేయడానికి బాలయ్య రెడీ అయ్యారు. అఖండ సినిమాతో వసూళ్ళ విషయంలో తాను ఏంటీ అనేది బాలయ్య ప్రూవ్ చేసారు.

అఖండ సినిమా 50వ రోజులో అడుగుపెట్టే సమయానికి థియేటర్లలో గ్రాస్-నాన్ థియేట్రికల్ రైట్స్ తో సహా మొత్తం రూ.200 కోట్లు వసూలు చేయగా… డాకూ మహారాజ్ తో ఆ రికార్డును బ్రేక్ చేయాలని బాలయ్య పట్టుదలగా ఉన్నారు. 250 నుంచి 350 కోట్లు వసూళ్లు వసూలు చేసేలా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. అఖండ సినిమాతో నార్త్ లో బాలయ్యకు మార్కెట్ పెరిగింది. ఇప్పుడు డాకూ మహారాజ్ తో నార్త్ ఇండియాలో పాగా వేయడానికి బాలయ్య తొడకోట్టారు.

Also Read : మట్కా వర్సెస్ కంగువ.. నెగటివ్ పబ్లిసిటీ దెబ్బ ఎవరికి?

‘ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు.. చీకటిని శాసించే రాక్షసులది ఆకదు.. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది… గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది… మరణాన్నే వణికించిన మహారాజుది’ అనే డైలాగ్స్‌తో టీజర్‌ మొదలైంది. ‘గుర్తుపట్టావా.. డాకు మహారాజ్‌’ అంటూ బాలయ్య మార్క్‌ డైలాగ్స్‌, విజువల్స్‌ ఈలలు వేయించేలా ఉన్నాయి. భిన్న కాలాల్ని ప్రతిబింబించే కథతో రూపొందుతుండటంతో.. ఈ కథ సాగే కాలానికి తగ్గట్లుగానే బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్