Saturday, September 13, 2025 02:55 AM
Saturday, September 13, 2025 02:55 AM
roots

ఫోన్ ట్యాపింగ్ లో షేక్ అవుతున్న బీఆర్ఎస్

తెలంగాణాలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ పరిణామాలు ఉంటాయనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు అధికారుల వరకు మాత్రమే పరిమితం అయిన ఈ కేసు వ్యవహారంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్ళాయి. ఇప్పటి వరకు రాజకీయ నాయకుల వరకూ ఈ వ్యవహారం వెళ్ళలేదు. కాని అనూహ్యంగా నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు.

Also Read :రేవంత్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు

ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా భావిస్తున్న… ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాలో గ్రీన్ కార్డు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో కేటిఆర్ ను అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా ఎప్పటి నుంచో జరుగుతోంది. అలాగే ఓ మాజీ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయవచ్చని భావిస్తున్నారు. కానీ కేసు మాత్రం ముందుకు వెళ్ళడం లేదు. ఈ తరుణంలో నల్లగొండ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రాజకీయ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Also Read :పిల్ల సజ్జల గ్యాంగ్ కి షాక్ ఇచ్చిన హైకోర్టు

ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన పోలీసులు… జిల్లాకు చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించనున్న పోలీసులు… వారిని అరెస్ట్ చేయవచ్చు అని భావిస్తున్నారు. SIB మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్నతో పలుమార్లు సంభాషించినట్లు గుర్తించారు. ఈ నెల 11న హాజరు కావాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు ఈనెల 8 న నోటీసులు జారీ చేసారు జూబ్లీహిల్స్ పోలీసులు. అనారోగ్య కారణంతో రేపు హాజరు అవుతానని చిరుమర్తి లింగయ్య సమాధానం ఇచ్చారు. అలాగే మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న అధికారులంతా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేసిన వారే అని పోలీసుల విచారణలో వెల్లడి అయింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్