ఇండియన్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ లో మరే హీరో కూడా ఇంత బిజీగా లేరు. వరుసగా సినిమాలు చేస్తూ ఏకంగా ఏడాదికి రెండు సినిమాలను రిలీజ్ ప్లాన్ చేస్తూ ప్రభాస్ ఓ రకంగా యుద్దమే చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఆ గ్యాప్ ను కవర్ చేయడానికి రెడీ అయ్యాడు. కథల విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇక కన్నడ సంస్థ హోంబలే ప్రభాస్ ను వదలడం లేదు. ప్రభాస్ తో వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
Also Read: దేవర రికార్డ్స్ పై గురిపెట్టిన పుష్ప 2
ఈ మూడు సినిమాలని 2026, 2027, 2028లలో రిలీజ్ చేయనున్నట్లు అఫీషయల్‌గా సోషల్ మీడియాలో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ‘సలార్ 2’ రిలీజ్‌తో ఈ జర్నీ ప్రారంభం అవుతుందని తెలపడంతో ఇప్పుడు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సలార్ 2… మూడేళ్ళ తర్వాత అని ఫ్యాన్స్ భావించారు. హోంబలే అధినేత విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ… ప్రభాస్ తో కలసి మరపురాని చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం అని… ‘సలార్ 2’ షూటింగ్ మొదలైంది అంటూ ఓ సంచలన విషయం బయట పెట్టారు.
Also Read: అలా మన తెలుగు హీరోలు చేయలేరా…?
భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఈ సినిమాలు ఉండబోతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదం పంచే దిశగా మా నిర్మాణ సంస్థ వేస్తున్న గొప్ప ముందడుగు ఇది అని ఆయన తెలిపారు. బాహుబలి తర్వాత మూడు సినిమాలు ప్రభాస్ కు షాక్ ఇస్తే సలార్ నుంచి హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం సలార్ 2 డైరెక్టర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నారని అందరూ భావించారు. కాని సలార్ 2 స్టార్ట్ అయిందని చెప్పడంతో ఆ సినిమా ఆగిపోయింది అనే అనుమానాలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.