ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలకు పోలీసులు సిద్దమయ్యారు. గత కొన్నాళ్ళుగా తప్పించుకుని తిరుగుతున్న వారిపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఇందుకు సంబంధించి న్యాయ పరమైన ఇబ్బందులు కూడా లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులపై కూడా ఫోకస్ చేసారు.
Also Read: టార్గెట్ వర్రా కాదా…? అసలు ఏం జరుగుతోంది…?
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసే నాయకులపై గురి పెట్టారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ… వైసీపీ సోషల్ మీడియా కోసం తమ అఫీషియల్ హ్యాండిల్స్ లో కంటెంట్ అందిస్తున్న నాయకులను గుర్తించి పోలీసులు రంగంలోకి దిగారు. తాజాగా యర్రగొండపాలెం వైసిపి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పేకాట క్లబ్ ల ద్వారా వారం వారం కమీషన్ లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు చేస్తూ X పేజీ లో సెప్టెంబరు లో పోస్ట్ చేసిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు అయింది.
Also Read: టార్గెట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా మృగాల వేట మొదలైంది
దీనిపై టిడిపి కార్యకర్త చేదూరి కిషోర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసారు యర్రగొండపాలెం ఎస్సై చౌడయ్య. ఈ మేరకు ఎమ్మెల్యే కు వాట్సప్ ద్వారా నోటీసు పంపించారు. అయితే ఎమ్మెల్యే మాత్రం నోటీసుకు స్పందించలేదు. దీనితో పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు. ఆర్కే రోజా, అంబటి రాంబాబు సహా పలువురు సోషల్ మీడియాలో రెచ్చిపోయే నాయకులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. విజయసాయి రెడ్డిపై కూడా కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం.